నివేదా థామస్‌కు కరోనావైరస్ పాజిటివ్.. టాలీవుడ్‌ను వెంటాడుతున్న కోవిడ్19
వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నివేదా థామస్ కరోనావైరస్ బారిన పడింది. ఇటీవల వకీల్ సాబ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఆమె తనకు కోవిడ్ 19 అనే విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దాంతో వకీల్ సాబ్ ప్రమోషన్‌లో పాల్గొన్న సెలబ్రిటీలు, మీడియా వర్గాలు అయోమయంలో పడిపోయారు. ఈ వివరాల్లోకి వెళితే...

టాలీవుడ్‌లో ప్రముఖులకు కరోనా
తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ సెకండ్ వేవ్ ప్రజలను, సెలబ్రీటలను అతలాకుతలం చేస్తున్నది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులను కోవిడ్19 వెంటాడుతున్నది. తాజాగా త్రివిక్రమ్, అల్లు అరవింద్ తర్వాత నివేదా థామస్ కరోనావైరస్ బారిన పడ్డారు. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్‌కు ఇలా వైరస్ బారిన పడటం అందర్ని కంగారు పెట్టిస్తున్నది.
చీరకట్టులో హంస నందిని సోయగాలు... స్లీవ్ లెస్ జాకెట్‌తో మరింత అందంగా

ట్విట్టర్‌లో స్పందించిన నివేదా థామస్
కరోనావైరస్ పాజిటివ్ గురించి నివేదా థామస్ తన ట్విట్టర్‌లో స్పందించారు. నాకు కోవిడ్19 పాజిటివ్ అని రోగ నిర్ధారణ పరీక్షల్లో స్పష్టమైంది. ప్రస్తుతం నేను స్వీయగృహ నిర్బంధంలో ఉన్నాను. మెడికల్ ప్రోటోకాల్స్‌కు లోబడి చికిత్స పొందుతున్నాను. త్వరలోనే పూర్తిగా కోలుకొంటానని భావిస్తున్నాను అని తన ట్వీట్‌లో నివేదా థామస్ వెల్లడించారు.

ఈ సమయంలో నాకు అండగా..
కరోనావైరస్ బారిన సమయంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. ముఖ్యంగా నా వెంట ఉండి నాకు చికిత్సను అందిస్తున్న మెడికల్ బృందానికి ధన్యవాదాలు. వారి సంరక్షణలో మంచి ట్రీట్‌మెంట్ అందుతున్నది. మీరంతా కూడా సురక్షితంగా ఉండాలని కోరుకొంటున్నాను. తప్పుకుండా మాస్క్ ధరించండి అంటూ తన ట్వీట్‌లో నివేదా థామస్ సూచించారు.

వకీల్ సాబ్ ప్రమోషన్స్‌లో బిజీగా
వకీల్ సాబ్ రిలీజ్ నేపథ్యంలో శుక్రవారం రోజున వాస్తవానికి మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉండింది. అనుకోకుండా అస్వస్థతకు గురికావడంతో ఆమె ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆమెకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.


Click it and Unblock the Notifications











