For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను తప్పు చేయలేదు.. ఆ విషయాన్ని పట్టించుకోను.. విడాకులు, ప్రెగ్నెన్సీ తర్వాత నుస్రత్ ఎమోషనల్ పోస్టు!

  |

  దేశంలోనే యువ ఎంపీగా, బెంగాలీలో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకొన్న నుస్రత్ జహాన్ జీవితం ఒక్కసారిగా కుదుపుకు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకొన్న వ్యక్తితో విడాకులు తీసుకోవడం ఆమెను మానసికంగా కొంత గందరగోళానికి గురిచేసింది. నుస్రత్ జహన్ విడాకులు వార్త వినగానే అభిమానులు, సినీ, రాజకీయ వర్గాలు షాక్ గురయ్యారు. అంతలోనే ఆమె గర్భవతి అనే విషయం మరింత సంచలనం రేపింది. ఇలాంటి పరిస్థితుల్లో నుస్రత్ జహాన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా చేసిన పోస్టు వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే...

  భర్తతో విడాకుల.. ప్రియుడితో ప్రెగ్నెన్సీ

  భర్తతో విడాకుల.. ప్రియుడితో ప్రెగ్నెన్సీ

  భర్త నిఖిల్ జైన్‌తో విభేదాలు తలెత్తడంతో అతడికి దూరమై.. తన సహచర నటుడు యష్ దాస్ గుప్తా డేటింగ్ చేస్తూ వచ్చింది. భర్తతో విడిపోయిన తర్వాత తన సహచర నటితో దిగిన ఫోటోలో కడుపు ఉబ్బెత్తుగా కనిపించడంతో గర్బవతి అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె కూడా తన ప్రెగ్నెన్సీపై సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వచ్చాయి.

  భావోద్వేగాల మధ్య 10 ఏళ్లు

  భావోద్వేగాల మధ్య 10 ఏళ్లు

  ఇలాంటి భావోద్వేగమైన సమయంలో నుస్రత్ జహాన్ సినిమా కెరీర్ 10 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. తాను నటించిన షోత్రూ చిత్రం జూన్ 15వ తేదీకి దశాబ్దం పూర్తి చేసుకోవడంతో ఇన్స్‌టాగ్రామ్‌లో సంతోషంగా పోస్టు పెట్టింది. అభిమానులు పెట్టిన వీడియోను షేర్ చేసి.. తనపై కురిపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్ అంటూ కామెంట్ చేసింది. పూజా నుంచి స్మిత పాత్రలో విలక్షణ నటిగా ఆదరించినందుకు ధన్యవాదాలు. పదేళ్ల నా సినీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకొంటే గర్వంగా ఉంది అని అన్నారు.

  పదేళ్లలో ఎన్నో మధురానుభూతులు, మైలురాళ్లు

  పదేళ్లలో ఎన్నో మధురానుభూతులు, మైలురాళ్లు

  సినీ తారగా అడుగుపెట్టిన క్షణం నుంచి ఎన్నో విజయాలు, ఎన్నో గమ్యాలు, హర్డ్ వర్క్, నవ్వులు, అనేక అనుభవాలు, ఎన్నో కలలతో 10 ఏళ్ల జీవితం గడిచిపోయింది. పూజాగా తొలిసారి కెమెరా ముందుకు వెళ్లగానే గుండె జారిపోయినంత పనైంది. అప్పటి నుంచి నేను సూపర్ డూపర్ క్షణాలతో ఎన్నో మధురానుభూతులు సొంతమయ్యాయి అని షేర్ చేసుకొన్నాయి అని ఆమె తెలిపారు.

  అభిమానుల సందేశాన్ని షేర్ చేసి

  అభిమానుల సందేశాన్ని షేర్ చేసి

  అభిమానులు రూపొందించిన వీడియో, సందేశాన్ని తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. మీ సినిమాలు మాకు మూడ్ చేంజర్. మాకు ఎంతో ఆనందాన్ని పంచే విధంగా ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించినందుకు రుణపడి ఉంటాం. మీలాంటి నటి లక్షల్లో ఒకరు ఉంటారు. మీరు మరింతగా విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాం అంటూ అభిమానులు ప్రేమతో రాసిన సందేశాన్ని నెటిజన్లతో నుస్రత్ జహాన్ పంచుకొన్నారు.

  Koratala Siva సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి.. Acharya కోసం సెంటిమెంట్ క్విట్ || Filmibeat Telugu
  నుస్రత్ పరోక్షంగా కామెంట్స్

  నుస్రత్ పరోక్షంగా కామెంట్స్

  భర్తతో విడాకులు విషయం బయటకు బహిర్గతమైన తర్వాత నుస్రత్ నర్మగర్భమైన పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ఎవరినో పరోక్షంగా టార్గెట్ చేస్తున్నట్లుగా ఉండే పోస్టులను ఇన్స్‌టాగ్రామ్‌లో పెడుతున్నారు. ఆమె నోరు మూయించిన మహిళగా నన్ను నేను గుర్తుంచుకొను. ఆ విషయంలో నేను ఎప్పుడు తప్పుచేయలేదనే ఫీలింగ్ నాకు లేదు అని నుస్రత్ జహాన్ ఒక పోస్టులో తెలిపారు.

  English summary
  My 10 years in Cinema. My first film #Shotru was released 10 years ago today on 3rd June 2011. Thank you eskaymovies rajchoco & jeet30 da, for your faith & courage. 😍I take this opportunity to thank everyone from Directors, Production Houses, Co-stars, Stylists, Make-up Artists, Hair Stylists and Technicians who have been a part of this wonderful journey. And most of all thank you my dearest audience for your trust. Love always.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X