అమితాబ్ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్.. చంపేందుకు కుట్ర.. స్టార్ హీరోయిన్ సంచలన ఆరోపణలు
సినిమా పరిశ్రమలో నటీనటులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం సహజంగానే కనిపిస్తుంటాయి. అయితే ఊహకు అందని విధంగా, అవాస్తవాలతో చేసే ఆరోపణలు సంచలనం రేపుతుంటాయి. అలాగే ఓ సూపర్ స్టార్ మీద ఆరోపణలు చేస్తే వాటి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఇండియాలో సూపర్ స్టార్‌గా మంచి రేంజ్‌లో ఉన్న అమితాబ్ బచ్చన్‌పై ఓ స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ ఆరోపణలు చేయడం అప్పట్లో చర్చనీయాంశయ్యాయి. ఆ హీరోయిన్ ఎవరు? ఆమెకు అలాంటి ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే వివరాల్లోకి వెళితే..
హిందీ సినిమా రంగంలో పర్విన్ బాబీ స్టైల్, గ్లామర్‌కు పెట్టింది పేరు. అతి తక్కువ కాలంలో హిందీ సినిమా ప్రపంచంలోనే కాకుండా ఇండియన్ సినీ రంగంలో కలల దేవతగా మారారు. 1970 నుంచి 1980 వరకు అత్యధిక రెమ్యనరేషన్ తీసుకొన్న హీరోయిన్‌గా రికార్డు సాధించారు. అయితే అలవాట్లు, అఫైర్లు ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి.

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పర్విన్ బాబీ రాణిస్తున్న సమయంలో యాక్టర్లు డానీ, కబీర్ బేడీ, మహేష్ భట్ లాంటి వారితో అఫైర్ నడిపిందనే వార్తలు వచ్చాయి. అయితే మహేష్ భట్‌తో ఆమె చేసిన సహజీవనం ప్రముఖంగా మీడియాలో కనిపించింది. వారిద్దరి వివాహేతర బంధం అప్పట్లో సెన్సేషన్‌గా మారింది. అయితే మహేష్ భట్‌తో బ్రేకప్ తర్వాత ఆమె మానసిక స్థితి అత్యంత దారుణంగా దిగజారింది.
దాంతో తనతో ఎనిమిది సినిమాల్లో నటించిన అమితాబ్ బచ్చన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. వారిద్దరూ సుహగ్, కాలా పత్తర్, నమక్ హలాల్, ది బర్నింగ్ ట్రైన్, షాన్, కాలియా, అమర్ అక్బర్ ఆంథోని లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. అలాంటి సహచర నటుడిపై తీవ్ర ఆరోపణలు చేయడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది.
అమితాబ్ బచ్చన్‌ను ఉద్దేశించి ఓ మీడియా ఇంటర్వ్యూలో.. ఆయన ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్. నన్ను చంపించేందుకు కుట్ర పన్నుతున్నాడు. నన్ను కిడ్నాప్ చేసి ఓ దీవిలో బంధించారు. నా చెవి కింద సర్జరీ చేసి ఓ ఎలక్ట్రానిక్ చిప్‌ను పెట్టారు. ఇదే రుజువు అంటూ తన చెవి కింద గాయాన్ని మీడియాకు చూపించారు. కానీ ఆమె మానసిక స్థితి బాగాలేదని కొట్టిపడేశారు.

అనేక వివాదాల మధ్య పర్విన్ బాబీ అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో మరణించారు. మూడు రోజుల నుంచి ఆమె గది తలుపులు తీయకపోవడంతో వర్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను మూడు రోజుల నుంచి పాలు, నిత్యావసర వస్తువులు డోర్ వద్ద పెడుతున్నా వాటిని తీసుకోవడం లేదని చెబితే.. ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే ఆమె మరణించడంతోపాటు ఆమె దేహం కుళ్లిన దశలో ఉందని పోలీసులు చెప్పారు. సుమారు 72 గంటల క్రితమే చనిపోయి ఉంటుందని చెప్పారు. అలా ఓ అద్బుతమైన నటి జీవితం విషాదంగా, అర్ధాంతరంగా ముగిసింది.
ఇదిలా ఉండగా, అమితాబ్ బచ్చన్ నటించిన తాజా చిత్రం కల్కి ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం వైపు దూసుకెళ్తున్నది. 80 ఏళ్ల వయసులో కూడా ఈ సినిమాలోని ఆయన పాత్ర, ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన తీరుపై ప్రశంసలు లభిస్తున్నాయి. అశ్వత్తామ పాత్రలో ఆయన కనిపించి తీరు. యాక్షన్ సీన్లలో నటించిన తీరు అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నది.


Click it and Unblock the Notifications











