తీస్‌మార్ ఖాన్‌తో పాయల్ రాజ్‌పుత్ రొమాన్స్.. గోవా బీచుల్లో శృంగార విన్యాసాలు.. ఫోటోలు వైరల్
టాలీవుడ్‌లో గ్లామర్ పంట పండించే యువ హీరోయిన్లలో పాయల్ రాజ్‌పుత్ టాప్‌లో ఉంటారు. RX 100 సినిమా తర్వాత పాయల్ రాజ్‌పుత్ అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను భారీగా సంపాదించుకొన్నారు. అందంతోనే కాకుండా అభినయంతో కూడా సినీ వర్గాలను మెప్పిస్తున్నారు. తాజాగా నటిస్తున్న చిత్రం తీస్‌మార్ ఖాన్ చిత్రంలోని పాయల్ రాజ్‌పుత్ స్టిల్స్ వైరల్‌గా మారాయి. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..
యువ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం తీస్‌మార్ ఖాన్. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటిస్తున్నది. హై యాక్షన్ ఓల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

హీరో ఆది సాయికుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్న సాయి కుమార్ ఈ పోస్టర్ లో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపించి అందరినీ అలరించారు.
ఇక గ్లామర్ డాల్ పాయల్ రాజ్‌పుత్ పాత్ర ఇప్పటి వరకు ఆమె చేసిన చిత్రాలకు భిన్నంగా, ఇది వరకు చూడని సరికొత్త క్యారెక్టరరైజేషన్‌తో అటు గ్లామర్ పరంగా, ఇటు పెర్ఫామెన్స్ పరంగా ఆకట్టుకోనున్నది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. హీరో, హీరోయిన్స్‌పై మంచి రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.

ఆది సాయికుమార్ డాన్స్, పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ కాగా సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్‌గా నిలవనుంది. విజన్ సినిమాస్ పతాకంపై ఈ సినిమా ను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తుండగా సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేయనున్నారు.
నటీనటులు: ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ఠాకూర్, పూర్ణ తదితరులు
డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ
ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తిరుమల రెడ్డి
మ్యూజిక్ : సాయి కార్తీక్
ఎడిటర్ : మణికాంత్
సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి
బ్యానర్ : విజన్ సినిమాస్


Click it and Unblock the Notifications











