ప్రభాస్‌తో పెళ్లి.. నిజమైతే బాగుండు.. యంగ్ హీరోయిన్ హాట్ కామెంట్

పాన్ ఇండియా సినిమాలతో మంచి జోరుమీదున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. రూ. కోట్లలో ఆయన పేరిట బిజినెస్ జరుగుతోంది.. డార్లింగ్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్ టూ బాలీవుడ్‌ ఇండస్ట్రీలకు చెందిన బడా నిర్మాణ సంస్థలు క్యూకడుతున్నాయి. ఆయన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. సరైన సినిమా పడక వెలవెలబోయిన థియేటర్లు తిరిగి జనంతో కళకళలాడేలా చేశారు ప్రభాస్. భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్షన్ కలయికలో వచ్చిన కల్కి రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. లాంగ్ రన్‌లో కల్కి మరింత విశ్వరూపం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కల్కి హిట్‌తో ఫుల్‌జోష్‌లో ఉన్న ప్రభాస్ దూకుడు పెంచారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ని త్వరగా పూర్తి చేసి ఫ్యాన్స్‌ని అలరించాలనే లక్ష్యంతో ఉన్నారు. సలార్ -2, ది రాజా సాబ్ సినిమాలు ముందు రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా మాస్ , యాక్షన్ సినిమాలకే పరిమితమైన ప్రభాస్‌ని కంప్లీట్ మేకోవర్ చేస్తున్నారు డైరెక్టర్ మారుతి. కామెడీ టచ్‌తో, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే ఎలిమెంట్స్‌తో రాజా సాబ్‌ని రెడీ చేస్తున్నారు మారుతి. ఇప్పటికే విడుదలైన ది రాజా సాబ్ వీడియో గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. సమ్మర్ కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

actress payal rajput react on marriage rumour with prabhas at Filmfare Awards South 2024

కెరీర్‌పరంగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నాడు డార్లింగ్. పాన్ ఇండియా మూవీస్‌తో, ఇంటర్నేషనల్ రేంజ్ క్రేజ్‌లో ఏ భారతీయ హీరో కూడా ప్రభాస్ దరిదాపుల్లో లేడు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్‌ని మాత్రం ఓ విషయం బాధిస్తోంది. అదే ఆయన పెళ్లి. టాలీవుడ్‌తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉంటాడు ప్రభాస్. ఆయన పెళ్లి ప్రస్తావన ఈనాటిది కాదు.. ప్రభాస్ కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి ఉన్నదే. అమ్మాయిని చూసేశాం, రేపో మాపో పెళ్లి అని వార్తలు రావడం తర్వాత ఊసురుమనిపించడం షరా మామూలు అయిపోయింది. ప్రభాస్‌‌కి పలువురు హీరోయిన్లతో లేనిపోనివి అంటగట్టి వార్తలు వండి వార్చారు పుకారు రాయుళ్లు.

actress payal rajput react on marriage rumour with prabhas at Filmfare Awards South 2024

ప్రభాస్‌తో పాయల్ రాజ్‌పుత్ పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. దీనిపై ఆమె స్వయంగా స్పందించారు. ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ -2024 ఈవెంట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన పాయల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీ గురించి వచ్చిన ఫన్నీ రూమర్ ఏంటీ అనే ప్రశ్నకు పాయల్ స్పందిస్తూ.. ప్రభాస్‌తో నా పెళ్లి జరిగిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయన్నారు. వాటిని చూసి తాను బాగా నవ్వుకున్నానని.. ఆ వార్తలు నిజమైతే బాగుండు అనుకున్నానని ఆమె తేల్చిచెప్పేశారు. తనకు ప్రభాస్ అంటే ఇష్టమని , అవకాశం వస్తే ఆయనతో కలిసి నటిస్తానని ఎన్నోసార్లు పాయల్ చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X