పాయల్ రాజ్‌పుత్ పెద్ద మనసు.. పెద్దాయనకు ఊహించని సర్‌ప్రైజ్!

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగువారిని పలకరించారు ఉత్తరాది భామ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో ఆమె పోషించిన ఇందూ పాత్రను తలచుకుంటే కుర్రాళ్లు ఇప్పటికీ వణికిపోతారు. తన అందంతో గిలిగింతలు పెట్టిన పాయల్.. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌తో క్రూరత్వం చూపించింది. ఈమె కారణంగానే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆర్ఎక్స్ 100 హిట్‌తో తెలుగు ఇండస్ట్రీలో ఆమె జెండా పాతుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు పత్తా లేకుండా పోయింది పాయల్ రాజ్‌పుత్.

ఆమెకు అలాంటి పరిస్ధితి రావడానికి ఆర్ఎక్స్ 100 మూవీ ఘన విజయం సాధించడమే కారణం. ఇదే తరహా థీమ్‌తో తెలుగులో సినిమాలు పోటెత్తడం, ఆమెను గ్లామరస్ రోల్స్‌కే పరిమితం చేయడం పాయల్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్ఎక్స్ 100 తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, సీత, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఒక అతిథి, తీస్‌మార్ ఖాన్, మాయాపేటిక, రక్షణ వంటి సినిమాలు చేశారు.

Actress Payal Rajput Wins Hearts With Her Kind Gesture For aged Security Guard

టాలీవుడ్‌లో ఇక కెరీర్ ముగిసినట్లేనని భావిస్తున్న వేళ.. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి మరోసారి ఆమెను ఆదుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మంగళవారం మూవీ మంచి విజయం సాధించడంతో పాయల్ రాజ్‌పుత్ రేసులోకి వచ్చారు. ప్రస్తుతం తమిళంలో గోల్‌మాల్, ఏంజెల్‌తో పాటు తెలుగులో కిరాతక, వెంకటలచ్చమి సినిమాలలో పాయల్ నటిస్తున్నారు. తన కెరీర్‌పై పలుమార్లు ట్రోలింగ్ జరిగినప్పటికీ వాటిని తట్టుకుని తన సినిమాలతోనే సమాధానం చెప్పారు ఈ ముద్దుగుమ్మ.

ముఖంపై చెరగని చిరునవ్వుతో నవ్వుతూ నవ్విస్తూ ఉండే పాయల్‌.. తన తండ్రి మరణంతో బాగా కృంగిపోయారు. క్యాన్సర్ కారణంగా పాయల్ తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ గతేడాది కన్నుమూశారు. నాటి నుంచి తండ్రి గురించి తరచుగా ప్రస్తావిస్తూ ఎమోషనల్ అవుతున్నారు. ఈరోజు ఫాదర్స్ సందర్భంగా నాన్నని గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన పెద్ద మనసును చాటుకున్నారు. తన అపార్ట్‌మెంట్‌కు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న పెద్దాయనకి ఆమె సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఈ 76 ఏళ్ల అంకుల్ మా అపార్ట్‌మెంట్‌కు కొత్త సెక్యూరిటీ గార్డ్. ఈ వయసులోనూ రోజుకు 12 గంటలు పనిచేస్తున్నారని పరిచయం చేసింది పాయల్. నేను మిమ్మల్ని మేడం అని పిలవను పాయల్ అని పిలుస్తానని చెబుతూ ఆ పెద్దాయన ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత అతని వద్ద ఉన్న కీ ప్యాడ్ ఫోన్ చూసిన పాయల్.. దీంతో ఫోటోలు తీసుకోలేమని కొత్త స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడవుగా కొత్త ఫోన్‌ని కొని పెద్దాయనకి సర్‌ప్రైజ్ చేసింది.

కొత్త ఫోన్‌ని తన చేతులతో ఓపెన్ చేసి.. ఏ సినిమా చూస్తావని అడిగారు పాయల్. దానికి తారక్ మెహతా నటించిన ఉల్టా చష్మా పెట్టమని చెప్పారు పెద్దాయన. ఆ తర్వాత అమెరికాలో ఉన్న ఆ పెద్దాయన కూతురితో వీడియో కాల్ మాట్లాడించింది. అయితే యాధృచ్చికంగా అతని బిడ్డ పేరు కూడా పాయల్ కావడం గమనార్హం. అమెరికాలో ఉండి భారతదేశానికి రాలేకపోతున్న కూతురిని చానాళ్ల తర్వాత చూసుకోవడంతో ఆ పెద్దాయన కంటతడి పెడుతూ పాయల్‌ రాజ్‌పుత్‌కు ధన్యవాదాలు తెలిపారు.

పిల్లలు తల్లిదండ్రులకు ఇవ్వగలిగే బహుమతి వారికి సమయాన్ని కేటాయించడమే. దయచేసి వారికి దూరంగా ఉండొద్దు, వారిని వదిలిపెట్టొద్దు. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం 76 ఏళ్ల వయసులోనూ కష్టపడి పనిచేస్తున్న సెక్యూరిటీ అంకుల్ కథ నన్ను కదిలించింది. అందుకే ఆయన గురించి వీడియో చేశాను. తల్లిదండ్రులు చివరి దశలో పిల్లల నుంచి ప్రేమను పొందాలని కోరుకుంటారు. అలా అందుకోలేని వారికి మనం ప్రేమను పంచుదామని పాయల్ రాజ్‌పుత్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పాయల్ రాజ్‌పుత్ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more about: payal rajput movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X