Pooja Hegde: అదొక చెత్త సినిమా.. ఆ డిజాస్టర్ వాళ్ళ ఇబ్బంది పడ్డా.. బుట్టబొమ్మ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ బుట్టబొమ్మ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం భాషా భేదం లేకుండా అగ్రహీరోలతో సినిమాలు చేస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆమె వరుసగా అవకాశాలు అందుకుంటూ తన స్టార్ ఇమేజ్ ను మరింత పెంచుకుంటుంది అనే చెప్పాలి. ప్రస్తుతం హీరోయిన్స్ లో ఎక్కువగా పారితోషికం అందుకుంటున్న వారిలో పూజా హెగ్డే టాప్ లిస్టులో ఉంది. ఇక పూజ హెగ్డే తన జీవితంలో ఎదుర్కొన్న ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ గురించి ఇటీవల ఎవరు ఊహించని విధంగా ఒక వివరణ ఇచ్చింది.. ఆ వివరాల్లోకి వెళితే..

అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా..
పూజా హెగ్డే కెరీర్ మొదట్లోనే మోడల్ గా మంచి గుర్తింపుని అందుకుని ఆ తర్వాత చాలా తొందరగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంది. అయితే ఆమెకు మొదట్లో కొన్ని ఫ్లాప్స్ ఎదురవడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా చాలా తొందరగా నే పడిపోయింది. ఇక ఆ తర్వాత ఆమె నిలదొక్కుకోవడానికి గ్లామర్ తో తనను తాను సరికొత్తగా హైలెట్ చేసుకుంది అనే చెప్పాలి. ఎప్పుడైతే డీజే సినిమాలో బికినీలో కనిపించిందో అప్పటి నుంచి ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

భారీగా రెమ్యునరేషన్
అల వైకుంఠపురములో సినిమా నుంచి పూజ హెగ్డే అయితే వరుస విజయాలతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా మారిపోయారు. ప్రస్తుతం బుట్టబొమ్మ ఒక్కో సినిమాకు 2కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. కేవలం గ్లామర్ తోనే కాకుండా నటనతో కూడా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సరికొత్తగా తనను తాను ప్రజెంట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అంతేకాకుండా సినిమాలో తన పాత్ర బలంగా ఉంటే గాని సినిమాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు.

మళ్ళీ వరుస అపజయాలు
అయితే ఇటీవల మాత్రం వరుస పరాజయాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా దారుణమైన ఫలితాన్ని సొంతం చేసుకుంది. రొమాంటిక్ అడ్వెంచర్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. అంతేకాకుండా తమిళ హీరో విజయ్ తో చేసిన బీస్ట్ సినిమా కూడా ఊహించని రిజల్ట్ ను అందుకుంది.

చెత్త సినిమా అదే..
అది మాత్రమే కాకుండా మెగా మల్టీస్టారర్ గా రూపొందిన ఆచార్య సినిమాల్లో దారుణమైన ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో పూజా హెగ్డే రామ్ చరణ్ తేజ్ కు జోడిగా నటించింది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా ఒక సినిమాకి గురించి మాట్లాడుతూ ఆ సినిమా మాత్రం తనను చాలా బాధ పెట్టింది అని చెప్పింది. ఆ సినిమా కారణంగా తనకు ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది అని.. తను చేసిన సినిమాలన్నటిలో అతిపెద్ద చెత్త సినిమా అదే అని వివరించింది.

ఆ సినిమా కారణంగా..
పూజా హెగ్డే మొహంజోదారో సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే అదే తన కెరీర్లో చాలా చెత్త సినిమా అంటూ ఆమె ఓపెన్ గానే తెలియజేయడం విశేషం హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఆ సినిమా తను చేయకుండా ఉండాల్సింది అని ఆ సినిమా వలన చాలా అవకాశాలు కూడా తనకు రాకుండా పోయాయని పూజా హెగ్డే వివరణ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేస్తోంది. మరి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











