Radhe Shyam: ప్రభాస్ తో మనస్పర్థలు.. ఆ ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసిన పూజ హెగ్డే!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూడవ ఇండియా సినిమా రాధేశ్యామ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా యువి క్రియేషన్స్ భారీ స్థాయిలో విడుదల చేస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డేకు అలాగే ప్రభాస్ కు మధ్యలో పలు సందర్భాల్లో మనస్పర్ధలు ఎదురైనట్లు ఆ మధ్య కాలంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.
అయితే ఆ విషయంపై చిత్ర యూనిట్ సభ్యులు కూడా మొదట్లో పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. ఆ తరువాత ఆలస్యంగా క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా అప్పటికే ఆ కథనాలను అందరూ నిజమని అనుకున్నారు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో పూజా హెగ్డే ఒక క్లారిటీ అయితే ఇచ్చింది.

ప్రతి చిన్న విషయం కూడా
సాహో సినిమా అనుకున్నంతగా సక్సెస్ సాధించలేకపోయినా ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయాలని అనుకుంటున్నాడు. కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా హిందీ తమిళ్ కన్నడ మలయాళం ప్రేక్షకులు కూడా సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అయితే సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అని అందరు నమ్ముతున్నారు.

ప్రభాస్ తో పూజా హెగ్డే ప్రమోషన్స్
మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రాధేశ్యామ్ ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతుంది. మొదటి రోజే ఈజీగా బాక్సాఫీస్ వద్ద 100కోట్ల కలెక్షన్స్ అందుకుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ప్రమోషన్స్ లో కూడా బిజీగా పాల్గొంటున్నారు. ప్రభాస్ తో పాటు పూజ కూడా మిగతా భాషల్లో ప్రభాస్ తో కలిసి ప్రమోషన్స్ చేసేందుకు వెళ్లింది.

ప్రభాస్ హెచ్చరించాడా?
అయితే ప్రతి ఇంటర్వ్యూలో కూడా పూజ, ప్రభాస్ కు సంబంధించిన అనేక రకాల విషయాలను మీడియా సభ్యులతో షేర్ చేసుకుంది. అయితే వీరికి మధ్యలో కొన్ని అభిప్రాయ భేదాలు కూడా ఉన్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. కొన్నిసార్లు షూటింగ్ విషయంలో కూడా యువి క్రియేషన్స్ ఆమె వలన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నట్లు టాక్ వినిపించింది. ఇక ఆ విషయంలో ప్రభాస్ కలుగజేసుకుని హీరోయిన్ పూజా హెగ్డే హెచ్చరికలు కూడా చేసినట్లు మరి కొన్ని కథనాలు వెలువడ్డాయి. కానీ అవన్నీ అబద్ధాలు అని చిత్ర యూనిట్ సభ్యులు కూడా పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.

మనస్పర్థలు లేవు..
ఇక రీసెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పూజా హెగ్డే తన వివరణ ఇచ్చింది. ప్రభాస్ తో మనస్పర్ధలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని రెగ్యులర్ షూటింగ్లో మేమిద్దరం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళమని కూడా చెప్పింది. అంతేకాకుండా ప్రభాస్ తన కోసం కొన్నిసార్లు ప్రత్యేకంగా స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకువచ్చారు అని తను చాలా మంచి వ్యక్తి అని కూడా పూజా హెగ్డే ప్రశంసలు కురిపించింది. ఇక తమ మధ్య లో గొడవలు జరిగినట్లు మాట్లాడుకోవడం లేదు అని వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు అని ఆమె మరోసారి కుండ బద్దలు కొట్టేసింది


Click it and Unblock the Notifications











