కాలిఫోర్నియా ట్రిప్‌లో బుట్టబొమ్మ.. లాస్ ఏంజెల్స్ బీచ్‌లో పూజా హెగ్డే అందాల ఆరబోత

ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ను అందుకుంది పూజా హెగ్డే. ఏకంగా ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో జత కట్టింది. తెలుగులోనే కాకుండా తమిళ్‌లోనూ మంచి సినిమాలు చేసింది. ఇక్కడ స్టార్ డమ్ ఉండగానే బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోవాలని భావించి ముంబైలో అడుగుపెట్టి అక్కడా మంచి హిట్లను తన ఖాతాలో వేసుకుని క్రేజ్‌ను పెంచుకుంది.

కానీ ఎందుకో తెలియదు కానీ గత కొంతకాలంగా పూజా హెగ్డేకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, కిసికా భాయ్ కిసి కి జాన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా అలరించలేదు. ఆమెకు హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన తెలుగులో పూజా హెగ్డేకు ప్రస్తుతం ఏ ఆఫర్లు దొరకడం లేదు, కొత్తగా ఆమెను సంప్రదించిన వారు కూడా లేరని ఫిలింనగర్ టాక్. హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా, తమిళ్‌లో సూర్య 44వ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నారు.

actress Pooja Hegde enjoy her vacation in Los Angeles at California here s the details

అయితే పూజ కెరీర్ ఇలా కావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయంటూ రకరకాల కథనాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా కోలీవుడ్‌‌లో ఓ స్టార్ హీరో పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయనతో సినిమాలు చేశాకే అన్ని ఫ్లాప్స్ వస్తున్నాయని , అతని వల్ల పూజ కెరీర్ రిస్క్‌లో పడిందని ప్రచారం జరిగింది. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం అప్పట్లో ఫిలిం సర్కిల్స్‌లో బాగా చర్చనీయాంశమైంది. ఈ దశలో టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాల నుంచి ఆమె తప్పుకోవడం కలకలం రేపింది.

అయితే పొగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే సిద్ధాంతాన్ని బాగా ఫాలో అవుతున్నారు పూజా హెగ్డే. తిరిగి అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవ్వాలని ఆమె భావిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాల అప్‌డేట్స్‌ను, హాట్ హాట్ ఫోటో షూట్స్‌ను పంచుకుంటూ హీట్ పుట్టిస్తోంది. ఇటీవలి కాలంలో వరుసపెట్టి ఫారిన్ ట్రిప్‌లకు వెళ్తూ ఆ ఫోటోలను పంచుకుంటున్నారు.

సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చి అమెరికాలో విహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మొన్నామధ్య పొట్టి నిక్కర్ వేసుకుని థైస్ చూపిస్తూ అడవిలో గడిపిన పూజ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇంకా యూఎస్‌లోనే ఉన్న ఆమె.. తాజాగా హాలీవుడ్ రాజధాని లాస్ ఏంజెల్స్‌ ట్రిప్ వేశారు. కాలిఫోర్నియాలోని అందమైన బీచ్‌లలో సేదతీరుతూ బాడీకాన్ మినీ క్యాజువల్ డ్రెస్‌లో థైస్ చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X