పూజా హెగ్డే, కృతి సనన్ షాకింగ్ నిర్ణయం.. అతనికి లీగల్ నోటీసులు.. లాభం లేదంటూ!
స్టార్ హీరోయిన్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి తర్వాత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకుంది. అయితే ఇటీవల మాత్రం ఆమెకు ఏ ఒక్క సినిమా కలిసి రావట్లేదు. దీంతో ఆమెను ప్లాప్ హీరోయిన్ గా భావిస్తున్నారు. అలాగే సైన్ చేసిన సినిమాల నుంచి కూడా తీసివేయడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పూజా హెగ్డే కీలక నిర్ణయం తీసుకుని ఒకరికి లీగల్ నోటీసులు పంపింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
మొన్నటి వరకు:మొన్నటి వరకు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా గా సత్తా చాటుతూ వచ్చింది టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్న కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురుములో మూవీలో బుట్టబొమ్మ అనే పాటతో టాలీవుడ్ బుట్టబొమ్మగా మారిపోయింది ఈ స్టన్నింగ్ బ్యూటి. అయితే సినిమాల్లోకి రాకముందు ముద్దుగుమ్మ పూజా హెగ్డే మోడలింగ్ రంగంలో అందాలను ఒలకబోసింది.

మరో పేరుతో :మోడలింగ్ లో తన అందచందాలతో అట్రాక్ట్ చేయడమే కాకుండా తన మాటలతో న్యాయ నిర్ణేతల మనసు దోచుకుంది బ్యూటిఫుల్ పూజా హెగ్డే. నటన మీద ఉన్న ఆసక్తితో వెండితెరపైకి అడుగు పెట్టింది. 2012లో తమిళంలో వచ్చిన మూగమూడి అనే చిత్రంతో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసింది. నటుడు జీవా హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో మాస్క్ అనే పేరుతో రిలీజ్ చేశారు.

జనాల్లో పాపులారిటీ :ఇక తెలుగులో 2014లో నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది పూజా హెగ్డే. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ తో జనాల్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది పూజా. అనంతరం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ముకుంద సినిమాలో లంగా ఓణీలతో పద్ధతిగా కనిపించి ఎంతో మంది యూత్ మనసులను కొల్లగొట్టింది.
హిట్టు సినిమాలు:పద్దతిగా కనిపించి అట్రాక్ట్ చేసిన పూజా హెగ్డేకు హిట్స్ అంతగా రాలేదు. దీంతో ట్రాక్ మార్చి గ్లామర్ బాట పట్టింది ఈ బ్యూటి. అందుకే అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాలో తడిచిన అందాలతో మెస్మరైజ్ చేసింది. తర్వాత రంగస్థలంలో జిగేల్ రాణిగా ఆడిపాడింది. తర్వాత అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలతో హిట్లు కొట్టింది.
లీగల్ నోటీస్:ఈ సినిమాల తర్వాతనే పూజా హెగ్డే గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ వంటి సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. గుంటూరు కారం సినిమా ఓకే అనుకున్న తర్వాత అందులో నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమెపై సినీ క్రిటిక్ గా చెప్పుకునే ఉమర్ సంధు ఘోరమైన విమర్శలతో పలు ట్వీట్ల్ చేశాడు. పూజా హెగ్డే ఐరన్ లెగ్ వంటివి చేయడంతో తాజాగా ఆమెకు లీగల్ నోటీస్ పంపింది బుట్టబొమ్మ.
ఆదిపురుష్ సీత:అయితే ఉమర్ సంధు ప్రతి చిత్ర పరిశ్రమకు చెందిన వారిని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తుంటాడు. అలా ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ పై చేయగా.. ఆమె కూడా లీగల్ నోటీసులు పంపింది. అయితే లండన్ లో ఉన్న ఉమర్ సంధుకు లీగల్ నోటీసులు పంపిస్తే లాభం ఏముంది అంటూ మరో క్రిటిక్ గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











