Pooja Hegde: బికినీ వేసినా ఇంత అందంగా ఉండదేమో.. మెరిసే డ్రెస్ లో కళ్ళు చెదిరే స్కిన్ షో!
టాలీవుడ్ బుట్ట బొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున అందుకున్న పూజా హెగ్డే ఎలాంటి డ్రెస్ లో అయినా సరే గ్లామర్ హైలైట్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఇక బ్యూటీ ఇటీవల కాలంలో అయితే కాస్త రెగ్యులర్ గా ఫోటోలను పోస్ట్ చేయడం తగ్గించింది అనే చెప్పాలి. ఇతర పనులలో బిజీగా ఉండడం వలన ఆమె ఫోటోషూట్స్ లలో పాల్గొనలేకపోయింది. ఇక చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అందులో ఆమె స్కిన్ షో తో ఫాలోవర్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఆ రేంజ్ లో తన అందాన్ని హైలైట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

బన్నీ సినిమాలతో..
కెరీర్ మొదట్లో కొన్ని చిన్న సినిమాలతోనే సక్సెస్ అందుకున్న పూజా హెగ్డే ఆ తర్వాత మెల్లగా తన క్రేజ్ పెంచుకుంటూ స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుంది. అల్లు అర్జున్ సినిమాలతోనే ఆమె కెరీర్ మరో లెవెల్ కి వెళ్ళింది అనే చెప్పాలి. అల్లు అర్జున్ తో మొదట చేసిన దువ్వాడ జగన్నాథం సినిమాతో పాటు ఆ తర్వాత చేసిన అల.. వైకుంఠపురములో రెండు కూడా ఆమె కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చాయి.

అగ్ర హీరోలతో..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది అగ్ర హీరోలు ఈ స్టార్ బ్యూటీ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే దాదాపుగా స్టార్ హీరోలందరిని కూడా ఈ బ్యూటీ కవర్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్.. ఇలా అగ్ర హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతోంది.

పెరుగుతున్న ఫ్యాన్స్ ఫాలోవర్స్
ఇక పూజ హెగ్డే సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటూ ఉంటుంది. ఈ బ్యూటీకి ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో 22. మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కేవలం గత రెండు మూడు నెలల్లోనే ఈ బ్యూటీ ఎక్కువ స్థాయిలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. అలాగే సోషల్ మీడియాలో బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ కూడా పూజా మంచి ఆదాయాన్ని అందుకుంటోంది.

పెళ్లి హడావుడిలో పూజా హెగ్డే
ఇక రీసెంట్ గా పూజా హెగ్డే షూటింగ్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఒక పెళ్లి వేడుకలో పాల్గొంది. తన సోదరుడు పెళ్లిని తన చేతుల మీద జరిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. వారి ఇంట్లో జరిగిన మొదటి పెళ్లి వేడుక కావడంతో అమ్మడు తన స్నేహితులతో కలిసి కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినట్లుగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

బికినీలో కంటే అందంగా..
ఇక ప్రస్తుతం ఈ స్టైలిష్ డ్రెస్ లో అమ్మడు సోషల్ మీడియాలో మరింత క్రేజ్ అందుకుంటోంది. గతంలో చాలాసార్లు బికినీలో కూడా కనిపించిన పూజా హెగ్డే ఈసారి మాత్రం మెరిసే డ్రెస్ లో చాలా అందంగా ఉంది అంటూ నెటిజన్లు చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సల్మాన్ ఖాన్ సినిమాతో పాటు మహేష్ బాబు 28వ సినిమా కూడా ఉంది. అలాగే తమిళంలో కూడా కొన్ని ప్రాజెక్టులను ఓకే చేసేందుకు చర్చలు జరుపుతోంది.


Click it and Unblock the Notifications











