పూజా హెగ్డే బుగ్గ గిల్లిన అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే..
అందాల తార పూజా హెగ్డే వరుస సినిమాలు, విజయాలతో దూసుకెళ్తున్నది. తెలుగు, హిందీ, కన్నడ అనే తేడా లేకుండా పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన అరవింద సమేత చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. దాంతో స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాన్ని కొట్టేసింది. దాంతో పూజా హెగ్డేకు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అయితే ఇటీవల ఓ అభిమాని చేసిన చిలిపిపని వైరల్‌గా మారింది.. అదేమిటంటే..

బుగ్గపట్టి లాగి.. సెల్ఫీ
పూజా హెగ్గేను అమితంగా అభిమానించే ఓ యువకుడు ఆమెతో సెల్పీ దిగాడు. నిజంగా అనుకొంటే పొరపాటే. ఫ్యాన్ దిగింది ఆమె పోస్టర్‌తో. ఫోటో దిగితే సరే.. కానీ బుగ్గపట్టి లాగినట్టు ఫోజిచ్చాడు. ఇలా చిలిపిగా వ్యవహరించడం ప్రత్యేకంగా మారింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా
ఓ గోడకు అంటించిన పూజా హెగ్డే పోస్టర్ పక్కన నిలబడి.. బుగ్గను పట్టి లాగినట్టు దిగిన ఫోటోను సదరు అభిమాని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దాంతో ఆ ఫోటో విస్తృతంగా ప్రచారం అయింది. అది ఎంతగా వైరల్ అయిందంటే.. ఏకంగా పూజా హెగ్డేను చేరేంతగా.

ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసిన పూజాహెగ్డే
తన అభిమాని చేసిన చిలిపిపనికి పూజా హెగ్డే ఫిదా అయింది. వెంటనే ఆ ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. నాపై నీకు ఉన్న ప్రేమను ఫీలయ్యాను అని ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నది. దాంతో ఆ ఫోటో మరింత పాపులర్ అయింది.

మహేష్, ప్రభాస్‌తో పూజా హెగ్డే
పూజా హెగ్డే విషయానికి వస్తే.. ప్రస్తుతం కన్నడ చిత్రంతోపాటు పలు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. మహేష్ బాబుతో మహర్షి సినిమాతోపాటు, ప్రభాస్, రాధాకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనున్నది. అలాగే ఓ హిందీ చిత్రంలో కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











