కూలితో పూజా హెగ్దే ఫూల్ అయ్యిందా? ఘాటుగా స్పందించిన బుట్టబొమ్మ!

హీరోయిన్ పూజా హెగ్దే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. భారీ విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఫీమేల్ లీడ్ లో నటించడమే కాకుండా స్పెషల్ సాంగ్స్ ల్లోనూ నటించి ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పూజా హెగ్దే కెరీర్ లోనే మరో బెస్ట్ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఆ చిత్రమే కూలి. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ చిత్రం. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

టాలీవుడ్ లో పూజా హెగ్దే కొన్నాళ్ల పాటు ఊపూపింది. అగ్ర హీరోలకు జోడీగా నటించి ప్రేక్షకులను అలరించింది. తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకుంది. ఇక పూజా హెగ్దే రంగస్థలంలో జిగేలు రాణి, ఎఫ్3లో మరో స్పెషల్ సాంగ్స్ ల్లో కూడా నటించి అలరించింది. ఇక చాలా కాలం తర్వాత మళ్లీ స్పెషల్ సాంగ్ తో వెండితెరపై సందడి చేయబోతోంది.

Actress Pooja Hegde Reacted on recent trolls about her song in Rajinikanth coolie Movie

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం కూలి. ఈ చిత్రంలో భారీ స్టార్ కాస్ట్ నటిస్తుండటం విశేషం. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్య రాజ్, సౌబిన్ షహిర్ వంటి వారు చాలా పవర్ ఫుల్ రూల్స్ లో నటిస్తుండటం విశేషం. ప్రతి ఒక్క పాత్రపై చాలా అంచనాలు పెంచేశారు. మెయిన్ హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ కు కూడా గుర్తుండిపోయే పాత్రను డిజైన్ చేశారని ప్రమోషన్స్ లో మేకర్స్, టీమ్ చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పూజా హెగ్దేకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కొంత నెగెటివ్ ప్రచారం జరిగింది.

కూలి చిత్రంలో పూజా హెగ్దే కేవలం గ్లామర్ కోసమే నటించిందని, ఆ సినిమా కథకు పూజా హెగ్దేకు ఎలాంటి సంబంధం లేదని దర్శకుడు లోకేష్ కనగరాజ్ కామెంట్స్ చేశారు. దాంతో పూజా హెగ్దేకు కమర్షియల్ గానే వాడుకున్నారని, స్టార్ హీరోలతో నటించే బుట్టబొమ్మకు ఇలాంటి పరిస్థితి ఏంటని ఆమె అభిమానులు అభిప్రాయపడుతూ వచ్చారు. స్పెషల్ సాంగ్ వల్ల ఆమె కెరీర్ కూడా కింద పడిపోబోతుందని నెగెటివ్ ప్రచారం సాగింది.

అయితే, తాజాగా పూజా హెగ్దే ఇలాంటి ప్రచారాలపై స్పందించింది. తనకు ముందే దర్శకుడు లోకేష్ చెప్పారని, తనను కేవలం కమర్షియల్ గానే తీసుకున్నారని చెప్పారని చెప్పింది. తను కూలిలో మోనికా సాంగ్ చేయడం వల్ల సినిమాకు మరింత రెవెన్యూ వస్తుండటం సంతోషమే కదా అని వివరించింది. ఇక పూజా హెగ్దే చివరిగా తెలుగులో రాధ్యే శ్యామ్ చిత్రంలో నటించింది. నెక్ట్స్ కోలీవుడ్ లో విజయ్ దళపతి నటిస్తున్న జన నాయగన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. కాంచన 4 చిత్రంలోనూ నటిస్తుండటం విశేషం.

More from Filmibeat

Read more about: pooja hegde rajinikanth coolie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X