Pooja Hegde : ‘నేను గ్యాప్ ఇవ్వలేదు.. రీసెంట్ గా జరిగింది ఇదే’

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్దే ఓ వెలుగొందిన సంగతి తెలిసిందే. సార్ హీరోల సరసన బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటించి కొన్నాళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా కొనసాగించింది. అక్కినేని నట వారసుడు నాగచైతన్య సరసన 'ఒక లైలా కోసం', వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' చిత్రాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీంది. బ్యాక్ టు బ్యాక్ వరుసగా హిట్స్ అందుకుంది. ఆచిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ తన నటన, అందం, అభినయంతో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. సినిమా సినిమాను విభిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేస్తుంది. మరోవైపు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకుంది. తెలుగు ఈ ముద్దుగుమ్మ పలు బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలను కూడా సొంతం చేసుకుంది.

పూజా హెగ్దేకు టాలీవుడ్ లో ఏర్పడ్డ క్రేజ్ కు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషక్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. మొహంజో దారోలో నటించి మెప్పించింది. ఏకంగా లిప్ లాక్ చేసి మతులు పోగొట్టింది. ఆ చిత్రం తర్వాత నుంచి టాలీవుడ్ లో అల్లు అర్జున్ సరసన 'డీజే', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'రంగస్థలం' మొదలు.. ఎన్టీతో అరవింద సమేత వీర రాఘవ, మహేశ్ బాబుతో మహర్షి, గద్దల కొండ గణేశ్, అలా వైకుంఠపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ సినిమాలన్నీ టాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి.

Actress Pooja Hegde Reacts about her Career in Tollywood

ఇంతటి రికార్డును సొంతం చేసుకున్న ఈ మ్దుదుగుమ్మకు టాలీవుడ్ లో ఒక్కసారిగా బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. భారీ ప్రాజెక్ట్స్ ల్లోనే సినిమా అవకాశాలు అందుతున్నా.. వాటి ఫలితాలు మాత్రం దారుణంగా దెబ్బ తీశాయి. ప్రభాస్ 'రాధే శ్యామ్', ఆచార్య చిత్రాలు ఎలాంటి ఫలితానిచ్చాయో తెలిసిందే. మరోవైపు తమిళంలోనూ బీస్ట్, హిందీలో సర్కస్, కిసి కా బాయ్ కిసి కా జాన్, దేవ వంటి సినిమాలు కూడా ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయాయి. దాంతో బుట్టబొమ్మను ఐరెన్ లెగ్ అంటూ ట్రోలింగ్ కూడా నడిచింది. ఈ క్రమంలో పూజా హెగ్దే టాలీవుడ్ నుంచి దూరమైందని, ఇక్కడ ఆఫర్లు ఇవ్వడం లేదని ప్రచారం జరిగింది.

ఆ మధ్య తనపై కావాలని డబ్బులిచ్చి మరీ నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నారని పూజా హెగ్దే మండిపడ్డ సంగతి తెలిసిందే. ఇక తాజాగా తెలుగు సినిమాల్లో అవకాశాలపై, టాలీవుడ్ లో తన కెరీయర్ పై స్పందించింది. రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్దే మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను రెట్రో చిత్రంలో నటించాను. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కాబోతోంది.

అయితే రెట్రో సినిమా కంటే ముందు తెలుగులో నా సినిమాలు పెద్దగా రాలేదు. అందుకని నేను టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉండాలనుకోలేదు. గ్యాప్ వచ్చింది. రీసెంట్ గానే ఒక తెలుగు సినిమాకు సైన్ చేశాను. అది త్వరలోనే అఫిషీయల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. దాని కంటే ముందు సూర్య తో నటించిన 'రెట్రో' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని వివరించింది. ఇక రెట్రో మూవీ మే1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

More from Filmibeat

Read more about: pooja hegde suriya Retro movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X