Pooja Hegde: సముద్రంలో బెడ్‌పై పూజా హెగ్డే అందాల ఆరబోత... ఇంత షాకిచ్చిందేంటి భయ్యా?
తన అందం, నటనతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ భామ అక్టోబర్ 13న తన పుట్టిన రోజు జరుపుకుంది. ఇక అందాల భామ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ... అందాలను ఆరబోసింది. ఏకంగా సముద్రంలోనే ఓ బెడ్ పై పడుకుని అందాలను ఆరబోసింది. అతి చిన్న డ్రెస్ లో సముద్రంలో పడుకుని.. షాక్ ఇచ్చింది. ఇక ఆ వీడియోపై ఓ లుక్ వేద్దాం పదండి.
బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు టాలీవుడ్ లో ఆమెకు చిత్రాలు లేక... కష్టాల్లో ఉందనే విషయం తెలిసిందే. ఈ భామకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమానే లాస్ట్ హిట్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమెకు ఏ సినిమా కలిసి రాలేదు.

ఇక ఆ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి ఆచార్య సినిమాలో నటించింది.. అటు రాదేశ్యాం సినిమాలోనూ ప్రభాస్ తో కలిసి రొమాన్స్ చేసింది. మరోవైపు తలపతి విజయ్ తో కలిసి బీస్ట్ సినిమాలో నటించింది. అయితే ఈ మూడు సినిమాలు ఆమెకు చేదు ఫలితాన్నే ఇచ్చాయి. ఈ మూడు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. అంతే కాదు పూజా హెగ్డేపై పలు విమర్శలు కూడా వచ్చాయి.
ఇక మహేశ్ బాబు త్రివిక్రమ్ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా చేయాల్సి ఉండే. కానీ ఏం జరిగిందో తెలియదు.. ఆమెను తప్పించారో.. లేదా.. తప్పుకుందో తెలియదు కానీ ఆ సినిమా నుంచి పూజా హెగ్డే ఔట్ అయింది. ఇక ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. ఇక ఈ సినిమా మిస్ చేసుకున్న తర్వాత బుట్టబొమ్మకు తెలుగులో ఏ సినిమా ఛాన్స్ రాలేదు. ప్రస్తుతానికి ఈ భామకు తెలుగులో ఏ సినిమాలు లేవు.

ఇక అక్టోబర్ 13న పూజా బర్త్ డే ను ఎంజాయ్ చేసింది. ఆమె తన 33 వ బర్త్ డేని చాలా స్పెషల్‌గా మార్చుకుంది బుట్టబొమ్మ. మాల్డీవుల్లో ఎంజాయ్ చేస్తూ... తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటుంది.ఈ సందర్భంగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాదు అవి చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. కామెంట్స్, లైక్స్ కురిపిస్తూ.. వాటిని ట్రెండింగ్ చేస్తున్నారు.
మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే ఫోటోలు క్రేజీగా ఉన్నాయి. సముద్రంలో బెడ్ వేసుకుని పడుకుంది బుట్ట బొమ్మ. తన థైస్ అందాలతో ఆకట్టుకుంటుంది ఈ భామ. అంతే కాదు పొట్టిదుస్తుల్లో రెచ్చిపోయింది. మరోవైపు బీచ్ లో గంతులేస్తూ, ఎంజాయ్ చేస్తూ ఆద్యంతం హ్యాపీగా గడిపింది ఈ భామ. మొత్తానికి తన బర్త్ డే ఎప్పటికి గుర్తిండిపోయేలా సెలబ్రేట్ చేసుకుంది బ్యూటీ. నైట్ పూట సెల్ఫీ పిక్స్ తో క్లోజప్ అందాలతో అలరించింది. మొత్తంగా తన డిఫరెంట్ లుక్స్, ఫోటోస్‌ని షేర్ చేసుకుని అభిమానులను ఖుషి చేసింది.


Click it and Unblock the Notifications











