బాగా తెగించేసిన పూజా హెగ్డే: లోదుస్తులు లేకుండా ఏంటా ఫోజులు?
చూపు తిప్పుకోకుండా చేయగల అందం, మైమరపించే నటనతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన అనతి కాలంలోనే స్టార్‌గా మారింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. తొలినాళ్లలోనే ఎన్నో హిట్లను అందుకుని వరుసగా సినిమాలు చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఈ అమ్మడు బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే అక్కడ వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఇక, పూజా హెగ్డే సోషల్ మీడియాలోనూ యమ సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూసేయండి!
అన్నింట్లో స్టార్టింగ్ ప్రాబ్లమ్:టీనేజ్‌లోనే పూజా హెగ్డే 'మూగమూడి' అనే తమిళ సినిమాతో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో తెలుగులోకి అడుగెట్టింది. అనంతరం నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు హిట్‌ను ఇవ్వలేదు. ఆ తర్వాత పూజా హిందీలో 'మెహాంజాదారో' చేసినా విజయం మాత్రం దరిచేరలేదు.

అప్పటి నుంచి జెట్ స్పీడ్:ఏ భాషలోనూ హీరోయిన్‌గా మంచి ఆరంభాన్ని అందుకోని పూజా హెగ్డేకు తెలుగులో ఫుల్ ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే 'అరవింద సమేత.. వీరరాఘవ'తో మొదటి హిట్ కొట్టింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని పూజా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుని సత్తా చాటుకుంది.
వరుస ఫ్లాపులు.. అక్కడకే:వరుసగా విజయాలను సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన పూజా హెగ్డే.. ఈ మధ్యన మాత్రం ఫ్లాపుల పరంపరతో సతమతం అవుతోంది. గత ఏడాది ఆమె నటించిన 'రాధే శ్యామ్', 'ఆచార్య', 'బీస్ట్' మూవీలు బిగ్ డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఈ బ్యూటీ హిందీలోకి వెళ్లి 'సర్కస్', 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' మూవీలు చేసింది. కానీ, ఇవి కూడా పెద్దగా ఆడలేదు.

ఆ సినిమా నుంచి అవుట్:పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా మహేశ్ బాబు 'గుంటూరు కారం', పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీల్లో ఈమె హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. కానీ, ఊహించని విధంగా ఈ హీరోయిన్‌ను ఈ రెండు సినిమాల నుంచి తప్పించారు. ఫలితంగా ఇప్పుడు పూజా హెగ్డేకు తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదనే చెప్పాలి.

అందులోనే ఫుల్ టైమ్:ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న పూజా హెగ్డే.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా తన రేంజ్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తోంది.

గ్లామర్‌తో మాయ చేసేలా:సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా పూజా హెగ్డే ఏ స్థాయిలో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలను సైతం ఎప్పుడూ వదులుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన పిక్‌లతో పాటు క్లీవేజ్ షో చేస్తోన్న ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో పూజా హెగ్డే పేరు మారుమ్రోగిపోతోంది.

పూజా హెగ్డే పిక్స్ వైరల్:స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె లోదుస్తులు లేకుండానే డ్రెస్ వేసుకుని కనిపించింది. అలాగే, కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఘాటు ఫోజులు కూడా ఇచ్చింది. ఫలితంగా ఆమె అందాలు మొత్తం హైలైట్ అవుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











