9 మందితో హీరోయిన్ భర్తకు ఎఫైర్లు... అమ్మాయిల్ని అలా ట్రాప్

సినిమాలో అందంగా కనిపించే హీరోయిన్ల జీవితాలు.. వ్యక్తిగతంగా మాత్రం అత్యంత విషాదంగా ఉంటాయి. సామాన్యుల మాదిరిగానే వారు కూడా వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు, కుటుంబ కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. ఇలాంటివి బయటికి చెబితే ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతో చాలామంది మౌనంగా భరిస్తుంటారు. ఎందరో హీరోయిన్ల వైవాహిక జీవితాలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ.. తెరవెనుక కష్టాలను బయటపెట్టాయి. తాజాగా సీనియర్ హీరోయిన్, బుల్లితెర నటి పూజిత తన వైహిక జీవితం గురించి చెబుతూ కన్నీటిపర్యంతం అయ్యారు.

90వ దశకంలో దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలుగొందారు పూజిత. గ్లామర్ రోల్స్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేశారు. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్‌ సినిమాలో రాజేంద్రప్రసాద్ భార్యగా నటించి పూజిత పాపులర్ అయ్యారు. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్‌గా, సహాయనటిగా కీలకపాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 120కి పైగా సినిమాలలో నటించారు. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్‌లో అలరించారు. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజిత మాట్లాడుతూ తన భర్త గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

Actress Poojitha Opens Up About Her Painful Married Life

నన్ను ఇంట్లోనే ఉంచి తాళం పెట్టి వెళ్లిపోయేవాడు. అప్పుడు మా పక్కింటివాళ్లు నా పేరెంట్స్‌కి ఫోన్ చేసి చెప్పేవాళ్లు. మా నాన్న ఇంటికొచ్చి వెళ్లిపోదామంటే నేను రాను అని చెప్పాను. ఒకసారి మా నాన్న ఇంటికొచ్చినప్పుడు నేను షూటింగ్‌కి వెళ్లాను, ఆయనని మెడపట్టి గెంటేశారట. నాన్న దగ్గర మాత్రమే ఏడ్చేదానిని. అప్పటికే నా భర్త వ్యసనపరుడు అయిపోయాడు. ఫిలింనగర్‌కి వెళ్లాక చెడు అలవాట్లు, స్నేహితులు ఎక్కువయ్యారు. ఇతని ఫేస్‌బుక్ అకౌంట్‌తో 9 మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు. మమ్మల్ని బెడ్‌రూంలో లాక్ చేసి వాళ్లతో ఛాటింగ్ చేసేవాడు అని పూజిత తెలిపారు.

యాక్సిడెంట్ అయి హాస్పిటల్‌లో రక్తపు మడుగులో పడి ఉంటే నేను డాక్టర్లతో ఫైట్ చేసి ట్రీట్‌మెంట్ అందేలా చేశా. నా భర్త, మరొకరో కాదు.. మానవత్వం ముఖ్యం. ఒక మనిషి రక్తంలో కొట్టుకుంటున్నాడు, ముందు హెల్ప్ చేయాలి. 8 గంటల పాటు .ఆపరేషన్ చేశారు. సంవత్సరం పాటు లేవలేడు అనుకున్న మనిషిని 3 నెలల్లో మామూలు మనిషిని చేశా. బాత్రూంలోకి వెళ్లినా నేనే చాకిరీ చేశా. ఇంత చేస్తే నువ్వు ఏదో చేశావంట అంటూ నానామాటలు అన్నాడు. ఆపరేషన్ జరిగినప్పటికీ గొడవలు పడి తన్నులు తిని వచ్చేవాడు. మా బాబు కోసం కూడా కనీసం స్పందించేవాడు కాదు అని పూజిత పేర్కొన్నారు.

నా దగ్గర ఉన్న డబ్బు, బంగారం అన్ని తీసుకుని వెళ్లిపోయాడు. దేవుడి తర్వాత భార్య ఎవరిని నమ్ముతుంది భర్తనే కదా. మొత్తం ఊడ్చేసి వెళ్లిపోతే మా బాబుని ఎలా పెంచాలా అని బాధపడ్డా. కాకపోతే మా బాబు కోసం హుండిలో రోజూ 100 రూపాయలు వేసేదానిని.. ఆ కుండ పగలగొట్టి వచ్చిన డబ్బుతో ఇంటి అద్దె, 6 నెలలకు సరిపడా సరుకులు, మా బాబుని స్కూల్ వేసేలా నన్ను ఆ హుండి కాపాడింది. 8 మందితో ఎఫైర్లు పెట్టుకుని వాళ్లని మోసం చేశాడు.. 9వ వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్. వీళ్లద్దరూ ఫేస్‌బుక్‌లో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన తర్వాత ఆ ఐఏఎస్ ఆఫీసర్ అమ్మానాన్న నా దగ్గరికి వచ్చారు. వాళ్ల నాన్నగారు గుండెకు స్టంట్ వేసుకుని ఉన్నారు. పెళ్లి ఆపాలని నాతో చెప్పారు.. అప్పట్లో లీడ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్‌లో పనిచేసే దానిని అని పూజిత వెల్లడించారు.

దాంతో అమ్మాయి ఎవరని అడిగితే ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పడంతో షాకయ్యా. విజయ్ గోపాల్ తెలుసా అని అడిగారు.. నీ మొగుడే పెళ్లిచేసుకుంటున్నాడు అని చెప్పారు. దాంతో నేను లోపలికి వెళ్లి డివోర్స్ పేపర్స్ చూపించా.. అతను విడాకులు ఇవ్వడం లేదని చెప్పా. నువ్వు మొదటి భార్యవి కాబట్టి.. నువ్వు అభ్యంతరం చెబితే పెళ్లి ఆగిపోతుంది. వాడు నా కూతురిని మోసం చేస్తున్నాడని చెప్పారు. ఐఏఎస్ ఆఫీసర్‌‌ని మోసం చేయడం ఏంటీ? ఆవిడ కనుసైగ చేస్తే పోలీసులు కుమ్మేస్తారు కదా అన్నా. అప్పటికే ఆమెకు 28 ఏళ్ల కొడుకు ఉన్నాడు.. నేను నోరు తెరిచి షాకయ్యా. కాసేపట్లో పెళ్లి అయిపోతుందని చెప్పడంతో నేను షీ టీమ్స్‌కి ఫోన్ చేసి చెప్పా. దాంతో మంటపం రిజిస్ట్రార్‌లో పేజీ చించేసి ఆధారాలు లేకుండా చేశాడు. అయితే మూడు రోజుల తర్వాత ఓ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరుండి పెళ్లి చేశారు. కొంతమంది పెద్దోళ్లకి వీడు బినామీ కావడంతో ఎన్ని కేసులు పెట్టినా వాళ్లే కాపాడుతున్నారు అని పూజిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో వైరల్ అవుతున్నాయి.

Read more about: actress poojitha movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X