9 మందితో నా భర్త‌కు సీక్రెట్ ఎఫైర్.. డబ్బు కోసం నన్ను అలా..

సీనియర్ నటి పూజిత (Actress Poojitha).. తెలుగు, తమిళం భాషలో కలిపి దాదాపు 138కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఇద్దరి పెళ్లాల ముద్దుల మొగుడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు బుల్లితెరపై రీఎంట్రీ ఇస్తూ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎన్నో భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన పూజిత, చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చి తన జీవితంలోని బాధాకర సంఘటనలను బయటపెట్టింది. ముఖ్యంగా కుటుంబ జీవితం గురించి ఆమె చెప్పిన విషయాలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి.

పూజిత ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. విజయ గోపాల్‌తో తన వివాహ జీవితం ప్రారంభమైన కొద్ది రోజులకే సమస్యలు మొదలయ్యాయి. అతను అప్పుల పాలై ఉండటం, ఆర్థికంగా అస్థిరంగా ఉండటం వంటి అంశాలు తనను తీవ్రంగా కలచివేశాయని తెలిపింది. డబ్బు కోసం తనను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన ఆమె, తర్వాత కాలంలో అతని అసలు స్వభావం బయటపడిందని చెప్పింది. తన నగలు, డబ్బు సహా దాదాపు రెండున్నర కోట్ల విలువైన ఆస్తిని అతను మోసం చేసి తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేసింది.

Actress Poojitha s Shocking Throwback Interview My Husband Had 9 Secret Affairs

ఇంకా, తన భర్త సోషల్ మీడియా ద్వారా అనేక మహిళలతో సంబంధాలు కొనసాగించాడని పూజిత ఆరోపించింది. ఒకసారి షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చినప్పుడు అతని ఫోన్‌లో అసభ్యకరమైన మెసేజ్ లు చూసి ఈ విషయం తెలుసుకున్నానని వెల్లడించింది. మొత్తం తొమ్మిది మంది మహిళలతో అతనికి ఎఫైర్లు ఉన్నాయని చెప్పడం మరింత సంచలనంగా మారింది. అందులో ఓ ఐఏఎస్ అధికారి కూడా ఉందని, ఆమెకు తన గురించి అన్ని విషయాలు తెలిసిన తన భర్తను పెళ్లి చేసుకుందని. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు తనను ఆశ్రయించారని షాకింగ్ కామెంట్స్ చేసింది.

తనకు ఒక కుమారుడు ఉన్నప్పటికీ, అతని భవిష్యత్తు కోసం తాను ఎన్నో కష్టాలు భరించానని పూజిత తెలిపింది. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి 18 సంవత్సరాల పాటు ఈ బంధాన్ని కొనసాగించానని, కానీ చివరికి తన భర్త వేరే మహిళను వివాహం చేసుకోవడం తనను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పింది. ముఖ్యంగా ఒక ఐఏఎస్ అధికారిణిని వివాహం చేసుకున్నాడని చేసిన ఆరోపణలు ఈ వ్యవహారాన్ని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన న్యాయం జరగలేదని పూజిత వాపోయింది.

తన భర్త వెనుక రాజకీయ నాయకులు, అధికారులు ఉన్నారని, అందుకే తనకు సహాయం అందలేదని ఆమె ఆరోపించింది. తనకు, తన కుమారుడికి తన భర్తతో ప్రాణహాని ఉందని పూజిత షాకింగ్ కామెంట్స్ చేసింది. తన వివాహానికి సంబంధించిన ఆధారాలను కూడా పద్ధతిగా తొలగించారని, అందువల్ల న్యాయపరంగా నిరూపించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమె వెల్లడించింది. అయినప్పటికీ తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేసింది. ఆమె చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి.

Read more about: actress poojitha tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X