బికినీ సైజ్ తగ్గించిన పూనమ్ బజ్వా: వామ్మో ఇదేం దారుణం సామీ!

టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్లుగా పరిచయం అయినా.. అందులో కొందరు మాత్రమే కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్లారు. కానీ, మరికొందరు మాత్రం టాలెంట్లు అన్నీ ఉన్నా సక్సెస్ కాలేకపోయారు. తద్వారా కెరీర్‌లను ప్రశ్నార్థకం చేసుకుని కనుమరుగైపోయారు. అలాంటి వారిలో తెలుగు హీరోయిన్ పూనమ్ బజ్వా ఒకరు. అందంతో పాటు అభినయంలో కూడా మెప్పించే ఈ చిన్నది.. అదృష్టం లేకపోవడంతో హీరోయిన్‌గా రాణించలేదు. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే దూరమైంది. సినిమాలు చేయకున్నా పూనమ్ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరే చూడండి!

విశాఖ భామ.. అలా మొదలైంది

విశాఖ భామ.. అలా మొదలైంది

పూనమ్ బజ్వా విశాఖపట్నంలో జన్మించింది. చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ తన అందాలతో ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ.. చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గా పని చేసింది. ఈ క్రమంలోనే 'మొదటి సినిమా'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో నవదీప్ హీరోగా నటించాడు. ఈ సినిమా మాత్రం పూనమ్‌కు హిట్ ఇవ్వలేదు.

చాలా సినిమాలు.. సక్సెస్ లేదు

చాలా సినిమాలు.. సక్సెస్ లేదు

'మొదటి సినిమా' తర్వాత పూనమ్ బజ్వా నవదీప్‌తో 'ప్రేమంటే ఇంతే', నాగార్జున సరసన 'బాస్' అనే సినిమాల్లో మాత్రమే హీరోయిన్‌గా చేసింది. వీటితో పాటు 'వేడుక', 'పరుగు' సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటించింది. కానీ, ఇవేమీ ఈ హీరోయిన్‌కు బ్రేక్‌ను ఇవ్వలేదు. దీంతో అవకాశాలు సన్నగిల్లాయి. ఫలితంగా పూనమ్ తెలుగు సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

ఆ భాషల్లో సత్తా.. మళ్లీ వచ్చినా

ఆ భాషల్లో సత్తా.. మళ్లీ వచ్చినా

టాలీవుడ్‌లో పూనమ్ బజ్వా సినిమాలు చేయకున్నా.. కెరీర్‌ను మాత్రం కొనసాగిస్తూనే వచ్చింది. ఈ క్రమంలోనే తమిళం, మలయాళం, కన్నడంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. దీంతో ఆయా ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. ఇక, సుదీర్ఘ కాలం తర్వాత 'ఎన్.టీ.ఆర్' బయోపిక్‌లో కీలక పాత్ర చేసింది. అయితే, ఈ సినిమా కూడా ఆమెకు ప్లస్ అవలేకపోయింది.

సినిమాలకు దూరంగా ఉంటూ

సినిమాలకు దూరంగా ఉంటూ

సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ పూనమ్ బజ్వాకు విజయాలు మాత్రం చాలా తక్కువగానే వచ్చాయి. దీంతో ఈ అమ్మడు ఇటీవలి కాలంలో సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. అడపాదడపా పలు చిత్రాల్లో కనిపిస్తున్నా అవి ఏమాత్రం ప్రభావాన్ని చూపడం లేదు. దీంతో ఈ అమ్మడి కెరీర్ ముగిసిపోయినట్లే అని అందరూ అనుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీనే

సోషల్ మీడియాలో ఫుల్ బిజీనే

చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్యలో వెండితెరపై పెద్దగా కనిపించకున్నా.. పూనమ్ బజ్వా మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తూ తరచూ విపరీతంగా హైలైట్ అవుతోంది.

అందాలతో హడావిడి చేస్తోంది

అందాలతో హడావిడి చేస్తోంది

సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో పూనమ్ బజ్వా చాలా సినిమాల్లోనే నటించింది. వాటన్నింటిలోనూ ఆమె సాధారణంగానే కనిపించింది. ఇదే ఆమె కెరీర్‌కు మైనస్ అయింది. అలాంటి ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఫలితంగా నిత్యం వార్తల్లోకి ఎక్కుతోంది.

పూనమ్ బికినీ ఫొటోలు వైరల్

పూనమ్ బికినీ ఫొటోలు వైరల్


పూనమ్ బజ్వా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టూ పీస్ బికినీ మాత్రమే ధరించి ఉంది. అంతేకాదు, స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుకుని అందాలను చూపిస్తోంది. ఫలితంగా ఆమె బాడీ పార్టులు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కి.. ఇవన్నీ బాగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X