తెలుగు హీరోయిన్ అందాల ఆరబోత: ఆమె డ్రెస్, ఫోజులు చూస్తే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లుగా సందడి చేశారు. అయితే, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. చాలా మంది మాత్రం టాలెంట్ ఉన్నా లక్ లేక అంతగా ఎదగలేకపోయారు. ఫలితంగా కెరీర్‌లను ప్రశ్నార్థకం చేసుకున్నారు. అలాంటి వారిలో తెలుగు హీరోయిన్ పూనమ్ బజ్వా ఒకరు. అందానికి అందం.. నటనకు నటన చేయగల సత్తా ఉన్నా ఈ అమ్మడు అదృష్టం లేకపోవడంతో హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే సినిమాలకు దూరమైంది. అయితే, ఈ మధ్య కాలంలో పూనమ్ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

వైజాగ్ బ్యూటీ... అప్పుడే ఫేమస్

వైజాగ్ బ్యూటీ... అప్పుడే ఫేమస్


తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సందడి చేసిన పూనమ్ బజ్వా విశాఖపట్నంలో జన్మించింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి.. ఆ వెంటనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ తన అందాలతో ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ.. చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గా పని చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో వ్యాపార ప్రకటనల్లో నటించింది. అలా ఆరంభంలోనే ఫేమస్ అయింది.

మొదటి సినిమాతో హీరోయిన్‌గా

మొదటి సినిమాతో హీరోయిన్‌గా

మోడలింగ్ రంగంలో హైలైట్ అవడంతో పూనమ్ బజ్వాకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 2005లో కూచిపూడి వెంకట్ తెరకెక్కించిన 'మొదటి సినిమా'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో నవదీప్ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం అంతగా ఆడలేదు. కానీ, నటిగా పూనమ్ బజ్వాకు మాత్రం మంచి పేరు దక్కింది.

సక్సెస్ లేదు.. టాలీవుడ్‌కు గ్యాప్

సక్సెస్ లేదు.. టాలీవుడ్‌కు గ్యాప్


'మొదటి సినిమా' తర్వాత పూనమ్ బజ్వా నవదీప్‌తో కలిసి 'ప్రేమంటే ఇంతే', అక్కినేని నాగార్జున సరసన 'బాస్' అనే సినిమాల్లో మాత్రమే హీరోయిన్‌గా నటించింది. వీటితో పాటు 'వేడుక', 'పరుగు' సినిమాల్లోనూ సహాయ పాత్రలు చేసింది. కానీ, ఇవేమీ ఈ హీరోయిన్‌కు బ్రేక్‌ను ఇవ్వలేకపోయాయి. ఫలితంగా పూనమ్ తెలుగు సినిమాలకు దూరమైపోయింది.

ఆ భాషల్లో హవా.. రీఎంట్రీలోనూ

ఆ భాషల్లో హవా.. రీఎంట్రీలోనూ

తెలుగులో సినిమాలు చేయకున్నా పూనమ్ బజ్వా.. కెరీర్‌కు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తమిళం, మలయాళం, కన్నడంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. దీంతో ఆయా ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఇక, సుదీర్ఘ కాలం తర్వాత 'ఎన్.టీ.ఆర్' బయోపిక్‌లో కీలక పాత్ర చేసింది. అయితే, ఈ సినిమా కూడా ఆమెకు ఆఫర్లను అందించలేదు.

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా

అప్పట్లో వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో వెండితెరపై పెద్దగా కనిపించకున్నా.. పూనమ్ బజ్వా మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తూ తరచూ తెగ హైలైట్ అయిపోతోంది.

అందాలను చూపిస్తూ హడావిడి

అందాలను చూపిస్తూ హడావిడి

పూనమ్ బజ్వా తన సినీ కెరీర్‌లో చాలా సినిమాల్లోనే నటించింది. వాటన్నింటిలోనూ ఆమె గ్లామర్ ట్రీట్ ఇవ్వకుండానే కనిపించింది. ఇదే ఆమె కెరీర్‌కు మైనస్ అయింది. అలాంటి ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఫలితంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

పూనమ్ గ్లామర్ ఫొటోలు వైరల్

పూనమ్ గ్లామర్ ఫొటోలు వైరల్

తాజాగా పూనమ్ బజ్వా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్ మాత్రమే ధరించి ఉంది. ఇలా ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా పూనమ్ షేర్ చేసిన ఫొటోలన్నీ వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X