అందాల డోస్ పెంచేసిందిగా ... హాట్ ఫోజులతో మంటలు పెడుతోన్న పూనం బజ్వా
వయసు పెరుగుతుండటంతో పాటు కొత్త అందాల రాకతో కొందరు ముద్దగుమ్మలు ఆఫర్లు కోల్పోతున్నారు. ఇలాంటి వారికి సోషల్ మీడియా మంచి ఫ్లాట్‌ఫాంలా మారింది. చేతిలో అవకాశాలు లేకపోవడంతో వీరంతా ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సెగలు పుట్టిస్తున్నారు. ఇలాంటి కోవలోకే వస్తారు పూనం బజ్వా. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా నేటికీ స్టార్ డమ్‌ను పొందలేకపోయారు పూనం.
విశాఖపట్నంలోని ఓ పంజాబీ కుటుంబంలో 5 ఏప్రిల్ 1985లో జన్మించారు ఈ అందాల భామ. తల్లిదండ్రులు అమర్జీత్ సింగ్ బజ్వా, జయలక్ష్మీ బజ్వా. ఆమె తండ్రి నేవీ ఆఫీసర్ . పూనంకు సోదరి దీపికా బజ్వా కూడా ఉన్నారు. చదువు పూర్తవ్వగానే తొలుత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఆమె.. మిస్ పూణే 2005 కీరిటం దక్కించుకున్నారు. మోడల్‌గా దేశంలోని టాప్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించి ఫేమస్ అయ్యారు.

2005లో నవదీప్ హీరోగా వచ్చిన మొదటి సినిమా అనే మూవీ ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పూనం .. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన బాస్‌లోనూ ఛాన్స్ అందుకున్నారు. కానీ ఈ సినిమా ఆశించిన విజయం దక్కించుకోకపోవడంతో ఆమె కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. తర్వాత మళ్లీ రెండేళ్లకు గానీ తెలుగులో పూనం బజ్వాకు అవకాశం దక్కలేదు. వేడుక, పరుగు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఏకంగా 10 ఏళ్ల తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పెద్ద కుమార్తె గారపాటి లోకేశ్వరిగా నటించారు పూనమ్ బజ్వా.
తెలుగునాట అంతగా గుర్తింపు, అవకాశాలు రాకపోవడంతో తమిళ్, కన్నడ , మలయాళ పరిశ్రమలలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించి కొంత వరకు సక్సెస్ అయ్యింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. ఇక గడిచిన రెండేళ్లుగా ఆమె ఖాళీగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. 2022లో చివరిసారిగా మళయాళంలో పాథనోత్పం నూట్టండు, మే హూ మూసా.. తమిళ్‌లో గురుమూర్తి సినిమాల్లో నటించింది.
హీరోయిన్ అన్నాక రూమర్స్ సహజం.. అలా ఓ తెలుగు డైరెక్టర్‌తో పూనం బజ్వా ప్రేమలో పడినట్లుగా వార్తలు వచ్చాయి. తర్వాత వీరిద్దరూ ఎవరి దారి వాళ్లు చూసుకున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యింది. అందం, అభినయం అన్ని ఉండి కూడా పూనమ్ బజ్వాకు అదృష్టం లేక ఇలా మిగిలిపోవాల్సి వచ్చిందని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో నిత్యం టచ్‌లో ఉండే పూనం బజ్వా.. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చగొడుతుంటారు. తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్‌లో మెడలో నెక్లెస్ వేసుకుని ఎద అందాలను ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం.. ఈ ముద్దుగుమ్మ సాలీడ్ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











