టిష్యూ లాంటి చీరతో నెట్టింట సునామీ .. కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేస్తోన్న పూనం బజ్వా

అందం, అభినయం దండిగా ఉన్నా కొంతమంది అమ్మాయిలు ఎందుకో చిత్ర పరిశ్రమలో సరిగా రాణించలేక కొంతకాలానికే ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. ఈ కోవలోకే వస్తుంది పంజాబీ ముద్దుగుమ్మ పూనం బజ్వా. దాదాపు 20 ఏళ్లుగా హీరోయిన్‌గా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆమెకు దక్కాల్సిన స్టార్ డమ్ రాలేదు. పూనం కంటే వెనుక నిన్నగాక మొన్న వచ్చిన భామలు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. కానీ ఈమెకు మాత్రం నిరాశ తప్పడం లేదు.

విశాఖపట్నంలో పంజాబీ కుటుంబంలో జన్మించారు పూనం బజ్వా . చదువు పూర్తవ్వగానే తొలుత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. దేశంలోని బడా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. మెస్మరైజింగ్ లుక్స్, క్యూట్ స్మైల్‌, చూడగానే ఆకట్టుకునే రూపంతో దర్శక నిర్మాతల కళ్లలో పడ్డారు పూనం బజ్వా. 2005లో మొదటి సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పూనం .. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన బాస్‌లోనూ ఛాన్స్ దక్కించుకుంది.

Actress Poonam Bajwa PhotoShoot with saree Her latest photos here

నాగ్ పక్కన హీరోయిన్ అంటే ఆమె కెరీర్ మలుపు తిరిగినట్లేనా అని అంతా భావించారు. కానీ బాస్ ఫ్లాప్ కావడంతో పూనమ్ ఆశలు ఆవిరయ్యాయి. మళ్లీ రెండేళ్లకు గాను తెలుగులో ఆమెకు అవకాశం దక్కలేదు. వేడుక, పరుగులో నటించిన ఆమె తర్వాత మళ్లీ టాలీవుడ్‌కు దూరమయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్‌‌లో ఆయన పెద్ద కుమార్తె గారపాటి లోకేశ్వరిగా నటించారు పూనమ్ బజ్వా.

తెలుగునాట అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో తమిళ్, కన్నడ , మలయాళ పరిశ్రమలలో గట్టిగా ట్రై చేసిన ఆమె కొంత మేరకు సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు హోమ్లీ అందాలతో పలకరించిన పూనమ్ బజ్వా .. కొన్ని సినిమాల్లో హాట్ హాట్‌గా కనిపించి కుర్రాళ్లకు నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చింది. 2022లో చివరిసారిగా మళయాళంలో పాథనోత్పం నూట్టండు, మే హూ మూసా.. తమిళ్‌లో గురుమూర్తి సినిమాల్లో నటించింది.

వయసు పెరుగుతుండటం, కొత్త అమ్మాయిల రాకతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. 40కి దగ్గరవుతున్నా ఇంకా పెళ్లి మాటే ఎత్తడం లేదు ఈ ముద్దుగుమ్మ. అయితే ఓ వ్యక్తితో ఈమె రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రతినిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది పూనం.

ముఖ్యంగా తన కెరీర్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ వస్తున్న పూనం బజ్వాకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా దీపావళి సందర్భంగా ఉల్లిపొర లాంటి చీరకట్టిన పూనం బజ్వా నాభి, ఎద అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్‌ను పెంచేశారు . ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: poonam bajwa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X