Poonam Bajwa : పొట్టి నిక్కర్‌లో హాట్ బ్యూటీ .. సాలీడ్ అందాలతో పూనం బజ్వా కవ్వింపులు
అందం, అభినయం దండిగా ఉన్నా కొంతమంది హీరోయిన్లు ఎందుకో చిత్ర పరిశ్రమలో స్టార్ డమ్ అందుకోలేక కొద్దికాలానికే ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. మరికొందరి విషయానికి వస్తే .. వీళ్లు ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ , అవకాశాలు వస్తున్నపటికీ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోతున్నారు. ఈ కోవలోకే వస్తుంది పంజాబీ ముద్దుగుమ్మ పూనం బజ్వా. దాదాపు రెండు దశాబ్థాలుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ దక్కలేదు. పూనం కంటే వెనుక వచ్చిన ముద్దుగుమ్మలు మాత్రం స్టార్ హీరోయిన్లుగా, నేషనల్ క్రష్‌లుగా వెలుగొందుతున్నారు. కానీ ఈమెకు మాత్రం నిరాశ తప్పడం లేదు.
సాగర నగరం విశాఖపట్నంలోని ఓ పంజాబీ కుటుంబంలో 5 ఏప్రిల్ 1985లో జన్మించారు పూనం బజ్వా . తల్లిదండ్రులు అమర్జీత్ సింగ్ బజ్వా, జయలక్ష్మీ బజ్వా. ఆమె తండ్రి నేవీ ఆఫీసర్ . పూనంకు సోదరి దీపికా బజ్వా కూడా ఉన్నారు. చదువు పూర్తవ్వగానే తొలుత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఆమె.. మిస్ పూణే 2005 కీరిటం దక్కించుకున్నారు. మోడల్‌గా దేశంలోని బడా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మెస్మరైజింగ్ లుక్స్, క్యూట్ స్మైల్, చూడగానే ఆకట్టుకునే రూపంతో దర్శక నిర్మాతల కళ్లలో పడ్డారు పూనం బజ్వా. 2005లో మొదటి సినిమా అనే మూవీ ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పూనం .. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన బాస్‌లోనూ ఛాన్స్ దక్కించుకుంది.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దికాలానికే నాగ్ పక్కన హీరోయిన్ అంటే ఆమె కెరీర్ మలుపు తిరిగినట్లే అని అంతా భావించారు. కానీ బాస్ ఘోర పరాజయం పాలు కావడంతో పూనమ్ కెరీర్‌పై దెబ్బపడింది. తర్వాత మళ్లీ రెండేళ్లకు గానీ తెలుగులో ఆమెకు అవకాశం దక్కలేదు. వేడుక, పరుగు సినిమాలలో నటించిన ఆమె ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్‌కు దూరమయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో రామారావు పెద్ద కుమార్తె గారపాటి లోకేశ్వరిగా నటించారు పూనమ్ బజ్వా.
తెలుగునాట అంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళ్, కన్నడ , మలయాళ పరిశ్రమలలో గట్టిగా ఫోకస్ పెట్టారు పూనం బజ్వా. వయసు పెరుగుతుండటం, కొత్త అందాల రాకతో పూనం బజ్వాకు అవకాశాలు తగ్గిపోయాయి. 2022లో చివరిసారిగా మళయాళంలో పాథనోత్పం నూట్టండు, మే హూ మూసా.. తమిళ్‌లో గురుమూర్తి సినిమాల్లో నటించింది. తనతో పాటు కెరీర్ ప్రారంభించిన హీరోయిన్లు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుండగా పూనం బజ్వా మాత్రం 40కి దగ్గరవుతున్నా ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు .
సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటోంది పూనం. ముఖ్యంగా తన కెరీర్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ వస్తున్న పూనం బజ్వాకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు పూనం . తాజాగా పొట్టి నిక్కర్ ధరించి థైస్, ఎద అందాలు చూపిస్తూ కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఇంకేందుకు ఆలస్యం ఆ సాలీడ్ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











