ఆ డైరెక్టర్ వల్లే ఆ హీరోయిన్ జీవితం నాశనం.. ట్వీట్‌తో మళ్లీ మంటపెట్టిన పూనమ్ కౌర్
సినిమాల్లో ఉన్న లేకున్నా తన వివాదాస్పద ట్వీట్స్, కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తారు సినీ నటి పూనం కౌర్. తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు బడా బాబులను టార్గెట్ చేస్తూ ఆమె ట్వీట్ల వర్షం కురిపిస్తారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా అందులోకి దూరిపోయి.. దానిని వివాదాస్పదం చేయడానికి ప్రయత్నిస్తుంటారు పూనం. పలుమార్లు ఆమె ట్వీట్స్‌పై దుమారం రేగిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా పూనం కౌర్ మరో సంచలన పోస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే :
మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూనం కౌర్ ఆ వెంటనే విచిత్రం, శౌర్యం, నిక్కీ అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం , నెక్ట్స్ ఏంటీ, గగనం వంటి సినిమాల్లో మెరిసింది. అందం, అభినయం బాగానే ఉన్నప్పటికీ ఎందుకో ఈ పంజాబీ ముద్దుగుమ్మకు కాలం కలిసి రాలేదు. స్టార్ హీరోయిన్ అవుదామని వచ్చి అడ్రస్ లేకుండా పోయింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత 2022లో వచ్చిన నాతిచరామితో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో, వెళ్లిందో కూడా తెలియదు.

మీటూ ఉద్యమం సమయంలో పూనం కౌర్ రెచ్చిపోయారు. ఇండస్ట్రీలో కొందరి వల్ల తాను నష్టపోయానని , అవకాశాల పేరుతో తనను వాడుకుని తన జీవితం నాశనం చేశారని ఆరోపిస్తూ వరుస ట్వీట్లు చేశారు. అయితే ఫేమ్ , మీడియాలో ఉండేందుకే పూనం కౌర్ ఆరోపణలు చేస్తున్నారంటూ నెటిజన్లు ఏకీపారేశారు. తర్వాత కాస్త సైలెంట్ అయిన పూనం కౌర్.. ఈ మధ్య యాక్టీవ్ అయ్యారు. గత కొన్నిరోజులుగా వరుసపెట్టి ట్వీట్లు పెడుతూ హల్‌చల్ చేస్తున్నారు.
మొన్నామధ్య కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూపైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చాలా మంది సినీ ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని, కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని పూనం మండిపడ్డారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు చేసిన ఫిర్యాదును పట్టించుకున్న వారు లేరంటూ ఫైర్ అయ్యారు. ఇటీవల సినీ నిర్మాత చిట్టిబాబు ఆమె ఫిర్యాదుపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. పూనం కౌర్‌ను పిలిస్తే ఆమె రావడం లేదని.. కానీ పిచ్చిపిచ్చి ట్వీట్లు చేస్తుంటారని మండిపడ్డారు. జరిగిందేంటో పెద్దలకు చెబితేనే తెలుస్తుందని.. అంతేకానీ ట్వీట్స్ వల్ల లాభం ఏంటని చిట్టిబాబు ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై పూనం ఘాటుగా స్పందించారు.
clarification -
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 9, 2024
it’s not the actor turned politician who impregnated n aborted the girl which ended her career - it’s the director who did it -maa involvement helped the half punjabi actor , I and actor/politician were pulled unnecessarily due political desperation #punjabigirl.
ఇది జరిగిన గంటల్లోనే పూనం కౌర్ మరో సంచలన పోస్ట్ పెట్టారు. '' ఇండస్ట్రీకి చెందిన ఓ డైరెక్టర్ వల్ల ఒక అమ్మాయి గర్బవతి అయ్యిందని, ఆమెకు అబార్షన్ చేయించి.. కెరీర్ నాశనం చేశాడు. మా అసోసియేషన్ ఆ పంజాబీ నటికి సాయం చేసింది. ఆ వ్యక్తి.. లీడర్‌గా మారిన నటుడు కాదు. కానీ నేను, పొలిటిషియన్‌గా మారిన ఆ నటుడు అనవసరంగా రాజకీయాల్లోకి లాగబడ్డామని '' ఆమె పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ పంజాబీ అమ్మాయి ఎవరు, ఆమెను గర్భవతిని చేసిందెవరు, ఆ లీడర్‌గా మారిన రాజకీయ నాయకుడు ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











