గురూజీపై మరోసారి నిప్పులు చెరిగిన పూనమ్ కౌర్.. దాసరిని లాగుతూ ఫోటో పెట్టి!
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడిపై సమయం చిక్కినప్పుడల్లా సినీ నటి పూనమ్ కౌర్ విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా గురూజీగా పిలువబడే దర్శకుడిపై ఆమె నిప్పులు చెరిగారు. స్వర్గీయ దాసరి నారాయణరావు ఫోటో పెట్టి ఆమె ట్వీట్ చేసి ఘాటుగా స్పందించింది. ట్విట్టర్‌లో చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ పోస్టు వివరాల్లోకి వెళితే..
గత కొద్దికాలంగా ప్రముఖ డైరెక్టర్‌ను టార్గెట్ చేసుకొని పూనమ్ కౌర్ సోషల్ మీడియాలోను, మీడియా ప్రెస్ మీట్స్‌లోను సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే ఆమె పరోక్షంగా విమర్శలు, ఆరోపణలు చేయడంతో ఈ వివాదం పెద్దగా ఎవర్నీ ఆకట్టుకోలేకపోయింది. అయితే తన పంథాలో తాను విమర్శలు చేస్తూ తన అసంతృప్తిని కొనసాగిస్తున్నది.

తాజాగా గురూజీపై మరోసారి ట్విట్టర్‌లో పోస్టు పెట్టింది. నేను గతంలో చెప్పాను. ఇప్పుడు కూడా చెబుతున్నాను. గురు అనే పదానికి ఒక్కరంటే ఒక్కరే ఈ ఇండస్ట్రీలో సరి తూగుతారు. సినిమా పరిశ్మలో అత్యధిక మంది గౌరవించేది కేవలం దాసరి నారాయణరావు గారిని మాత్రమే. ఆయనకు టాలెంట్‌ను గుర్తించే వ్యక్తిగా ఆయనకు పేరుంది అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక అదే ట్వీట్‌లో కామెంట్ చేస్తూ.. ఆయనకు భిన్నంగా ఓ వ్యక్తి స్క్రిప్టులను హైజాక్ చేస్తారు. స్క్రిప్టును హైజాక్ చేసినంత సులభంగా దాసరి గారికి ఉన్న గురూజీ అనే టైటిల్‌ను హైజాక్ చేయడం అంత సులభం కాదు అంటూ సెటైర్లు వేసింది.
అయితే పూనమ్ కౌర్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అవును చాలా గౌరవనీయులైన వ్యక్తి అంటూ కొందరు కామెంట్ చేశారు. అయితే మరికొందరు మాత్రం ఎన్నికల సమయాన్ని చూసుకొని కరెక్ట్ టైమ్‌లో ఎంట్రీ ఇచ్చావు. సింపతి సంపాదించుకోవడానికి భలే ప్లాన్ వేశావు. సెటైర్లు బాగానే వేశావు. కానీ అందరికి అర్ధమయ్యేలా చెప్పు అంటూ కామెంట్లు విసురుతున్నారు.


Click it and Unblock the Notifications











