For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆగిపోయిన హీరోయిన్ పూర్ణ పెళ్లి: క్లారిటీ ఇస్తూ ఇన్‌స్టా పోస్ట్.. ఆ ఫొటో షేర్ చేయడంతో!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. అందులో కొందరు మాత్రమే మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో క్లాసికల్ డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత హీరోయిన్‌గా స్థిరపడిన టాలెంటెడ్ యాక్ట్రెస్ పూర్ణ అలియాస్ సామ్నా కాసీం ఒకరు. పేరుకు మలయాళీ భామే అయినా.. తెలుగులో చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులర్ అయింది.

  ఫలితంగా తెలుగులోని ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఇలా కెరీర్ పరంగా సక్సెస్ అయిన పూర్ణ ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కానీ, ఆమె పెళ్లి ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  అలా పాపులర్ అయిన హీరోయిన్

  అలా పాపులర్ అయిన హీరోయిన్

  హీరోయిన్ పూర్ణ ‘శ్రీ మహాలక్ష్మీ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు ‘అవును', ‘అవును 2' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ క్రమంలోనే ‘సీమటపాకాయ్', ‘సిల్లీ ఫెలోస్', ‘అదుగో', ‘రాజుగారి గది', ‘మామ మంచు అల్లుడు కంచు' సహా ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది.

  బిగ్ బాస్ దివి పరువాల విందు: వామ్మో ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే!

  మంచి పాత్రలు... భారీ చిత్రాలు

  మంచి పాత్రలు... భారీ చిత్రాలు

  చాలా కాలం పాటు హీరోయిన్‌గా సందడి చేసిన పూర్ణ.. ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రలు చేసింది. ఇప్పటికే ఆమె ‘తలైవి' మూవీలో శశికళ పాత్రను పోషించి సత్తా చాటింది. అలాగే, బాలకృష్ణ ‘అఖండ', వెంకటేష్ ‘దృశ్యం 2' సహా ఎన్నో భారీ చిత్రాల్లో భాగం అయింది. అలాగే, నాని ‘దసరా' మూవీలో విలన్ పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  బుల్లితెరపైనా వరుసగా ఆఫర్లు

  బుల్లితెరపైనా వరుసగా ఆఫర్లు

  తెలుగు సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న పూర్ణ.. చాలా కాలంగా బుల్లితెరపైనా సందడి చేస్తోంది. ఇప్పటికే వేరే భాషల్లో పలు షోలలో పని చేసిన ఈ అమ్మడు.. తెలుగులో ‘ఢీ' షోకు జడ్జ్‌గా చేసింది. దాదాపు మూడు సీజన్లుగా ఇందులో కనిపిస్తోన్న ఆమె.. ఆ తర్వాత జబర్ధస్త్, శ్రీదేవి డ్రామ కంపెనీ, కామెడీ స్టార్స్ వంటి షోలు చేసింది.

  పబ్లిక్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: అతడికి లిప్ కిస్ పెట్టేసి ఘోరంగా!

  ఎంగేజ్‌మెంట్ చేసుకున్న పూర్ణ

  ఎంగేజ్‌మెంట్ చేసుకున్న పూర్ణ

  ఈ మధ్య కాలంలో పూర్ణ తెలుగులో మరెవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా సినిమాలు, టీవీ షోలతో కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోంది. అలాగే, బుల్లితెరపైనా సందడి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పూర్ణ అలియాస్ సామ్నా కాసీం దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీ ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెళ్లికి సిద్ధం అయింది.

  ఆగిపోయిన హీరోయిన్ పూర్ణ పెళ్లి

  ఆగిపోయిన హీరోయిన్ పూర్ణ పెళ్లి

  దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీతో నిశ్చితార్థం చేసుకున్న పూర్ణ.. అతడితో వైవాహిక జీవితాన్ని పంచుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే, ఇప్పుడు వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదని.. పర్సనల్ రీజన్స్‌తో ఈ వివాహం క్యాన్సిల్ అయిందని ఓ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోతోంది.

  Bigg Boss 6: షోలోకి ముగ్గురు యాంకర్లు.. లీకైన కంటెస్టెంట్ల పేర్లు.. తెలుగు భామలకు లక్కీ ఛాన్స్

  ఆ ఫొటో షేర్ చేసిన నటి పూర్ణ

  ఆ ఫొటో షేర్ చేసిన నటి పూర్ణ

  షానిద్ ఆసిఫ్ అలీతో హీరోయిన్ పూర్ణ పెళ్లి ఆగిపోయినట్లు అటు సోషల్ మీడియాలో, ఇటు న్యూస్ ఛానెళ్లలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఇది నిజమేనేమో అని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో తనకు కాబోయే భర్త షానిద్ ఆసిఫ్ అలీతో చాలా సన్నిహితంగా ఉంది.

  Recommended Video

  NASA అంతరిక్షంలోకి Athira Preeta Rani... ఎవరీమె? *Trending | Telugu OneIndia
  పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

  పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

  తనకు కాబోయే భర్త షానిద్ ఆసిఫ్ అలీతో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేసిన హీరోయిన్ పూర్ణ ‘ఎప్పటికీ నావాడు' అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయిందని వస్తున్న వార్తలను పరోక్షంగా ఖండించింది. దీంతో ఇప్పుడు పూర్ణ షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది.

  English summary
  Tollywood Actress Poorna AKA Shamna Kasim Gets Engaged. Recently She Shares Personal Photo and Gave Clarity on MArriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X