For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Poorna Gets Engaged: కోటీశ్వరుడితో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ పూర్ణ.. అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే!

  |

  క్లాసికల్ డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత హీరోయిన్‌గా స్థిరపడిపోయింది టాలెంటెడ్ యాక్ట్రెస్ పూర్ణ అలియాస్ సామ్నా కాసీం. మలయాళ చిత్రాల ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ సుందరాంగి.. చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులర్ అయిపోయింది. ఫలితంగా అక్కడ స్టార్‌డమ్‌ను అందుకుంది.

  అదే సమయంలో తెలుగులోకీ ఎంట్రీ ఇచ్చి నటిగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఇక, ఇటీవలే సెకెండ్ ఇన్నింగ్స్‌ను కూడా ప్రారంభించి వరుసగా సినిమాలు చేస్తోంది. ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే పూర్ణ తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ క్రమంలోనే తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  అలా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్

  అలా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్


  'శ్రీ మహాలక్ష్మీ' అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది పూర్ణ. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు 'అవును', 'అవును 2' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ క్రమంలోనే 'సీమటపాకాయ్', 'సిల్లీ ఫెలోస్', 'అదుగో', 'రాజుగారి గది', 'మామ మంచు అల్లుడు కంచు' సహా ఎన్నో చిత్రాల్లో నటించిందీ బ్యూటీ.

  బాత్రూంలో బ్రాతో హీరోయిన్ సెల్ఫీ: ఆ పార్ట్ కూడా కనిపించేలా యమ ఘాటుగా!

  సౌత్ ఇండియాలో ఫుల్ ఫేమస్

  సౌత్ ఇండియాలో ఫుల్ ఫేమస్


  కేరళకు చెందిన పూర్ణ.. ఎక్కువగా మలయాళ చిత్రాల్లోనే నటించింది. ఈ క్రమంలోనే అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, కన్నడ భాషల్లోనూ ఎన్నో చిత్రాల్లో కనిపించి మెప్పించింది. ఇలా దక్షిణాది మొత్తం తన హవాను చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో విజయాలను అందుకుంది. తద్వారా నటిగా పలు అవార్డులను సైతం ఖాతాలో వేసుకుంది.

  భారీ చిత్రాలు.. మంచి పేరుతో

  భారీ చిత్రాలు.. మంచి పేరుతో


  హీరోయిన్‌గా చాలా కాలం పాటు సందడి చేసిన పూర్ణ.. ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పటికే ఆమె 'తలైవి' మూవీలో శశికళ పాత్రను పోషించి సత్తా చాటింది. అలాగే, బాలకృష్ణ 'అఖండ', వెంకటేష్ 'దృశ్యం 2' సహా ఎన్నో భారీ చిత్రాల్లో భాగం అయింది. అలాగే, చిన్న చిత్రాల్లోనూ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా పోషించింది.

  జాన్వీ కపూర్ ఎద అందాల విందు: అబ్బో ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే

  బుల్లితెరపైన సందడి చేస్తోంది

  బుల్లితెరపైన సందడి చేస్తోంది


  వెండితెరపై తన నటనతో తనదైన ముద్రను వేసుకున్న పూర్ణ.. బుల్లితెరపైనా సందడి చేస్తోంది. ఇప్పటికే వేరే భాషల్లో పలు షోలలో పని చేసిన ఈ అమ్మడు.. తెలుగులో 'ఢీ' అనే డ్యాన్స్ షోకు జడ్జ్‌గా చేస్తోంది. దాదాపు మూడు సీజన్లుగా ఇందులో కనిపిస్తోన్న ఆమె.. అద్భుతమైన జడ్జ్‌మెంట్‌తో ఆకట్టుకుంటోంది. అదే సమయంలో కొన్ని రొమాంటిక్ స్కిట్లతో మరింత ఫేమస్ అయింది.

  ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నటి

  ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నటి

  కొంత కాలంగా హీరోయిన్ పూర్ణ తెలుగులో మరెవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా సినిమాలు, టీవీ షోలతో కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోంది. ఇటీవలే జబర్ధస్త్ షోలోకి జడ్జ్‌గా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె కెరీర్ మూడు పూవులు ఆరు కాయలుగా సాగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పూర్ణ అలియాస్ సామ్నా కాసీం ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చేసింది.

  Hyper Aadi: హైపర్ ఆది పరువు తీసిన యంగ్ హీరో.. శృంగారం లేకుండా.. ఆయన ఏమీ చేయడు అంటూ!

  కాబోయే భర్తను చూపిస్తూ ఇలా

  కాబోయే భర్తను చూపిస్తూ ఇలా


  తాను చేసుకోబోయే వ్యక్తితో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన పూర్ణ.. ఈ మేరకు 'మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో ముందడుగు వేయబోతున్నా. షానిద్ ఆసిఫ్ అలీతో ఎంగేజ్‌మెంట్ అయిపోయింది' అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు అభిమానులతో పాటు సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ కామెంట్లు వస్తున్నాయి.

  పూర్ణ చేసుకునే వ్యక్తి ఎవరంటే

  పూర్ణ చేసుకునే వ్యక్తి ఎవరంటే


  పూర్ణ అలియాస్ సామ్నా కాసీం చేసుకోబోతున్న అసిఫ్ అలీ అని అందరూ ఆరా తీసున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈయన ఓ బిజినెస్‌మ్యాన్ అని తెలిసింది. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ అని సమాచారం. కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి అని అంటున్నారు. ఇదిలా ఉండగా.. వీళ్లది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన వివాహమో తెలియలేదు.

  English summary
  Tollywood Actress Poorna AKA Shamna Kasim Gets Engaged. Recently She Introduces To Her Fiancee Shanid Asifali Via Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X