HBD Pragathi హాట్ డ్రస్‌లో బర్త్ డే ట్రీట్.. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా నటి ప్రగతి

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తెలుగులో అనేక వందల సినిమాల్లో నటించిన ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మారిన తర్వాత ఆమె వరుసగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె పుట్టిన రోజు వేడుకల్లో ఒక హాట్ ఔట్ ఫిట్ లో మెరిసింది. దీంతో ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆ వివరాల్లోకి వెళితే

వీడియోలు చేస్తూ

వీడియోలు చేస్తూ

టాలీవుడ్‌లో అమ్మగా, అత్తగా, అక్కగా అనేక పద్ధతి అయిన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎన్నో సినిమాల్లో అత్త, పిన్ని, తల్లి పాత్రలు పోషించే ఆమె కేవలం నటనలోనే కాదు సరైన అవకాశం వస్తే.. డ్యాన్స్‌లోనూ ఇరగదీస్తాను అనేలా అప్పుడప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో వదులుతోంది.

విశ్వరూపం చూపిస్తూ

విశ్వరూపం చూపిస్తూ

ప్రకాశం జిల్లా ఒంగోలులో పుట్టిన ప్రగతి సినిమాల్లో హీరోయిన్ గా మారాలని చెన్నై వెళ్లారు. మొదట హీరోయిన్‌గా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రగతి తనకు వర్కౌట్ కాదని భావించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే తెర మీద చాలా పద్దతైన పాత్రల్లో మాత్రమే కనిపిస్తూ ఉండే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం తన విశ్వరూపం చూపిస్తూ ఉంటారు.

పుట్టినరోజు వేడుకలు

పుట్టినరోజు వేడుకలు

ఒక రకంగా చెప్పాలంటే ఆమె తన రకరకాల వీడియోలతో, డ్యాన్స్ చేస్తూ, వర్కౌత్స్ చేస్తూ వీడియోలు వదిలి రచ్చ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా సార్లు తన క్యూట్ అండ్ హాట్ డాన్స్ వీడియోలు పోస్ట్ చేసి కుర్రాళ్ళలో ఫాలోయింగ్ పెంచుకున్న ఆమె ఇప్పుడు తన పుట్టిన రోజు సంధర్భంగా మాత్రం ఒక హాట్ ఔట్ ఫిట్ లో కనిపించి రచ్చ రేపింది. దీంతో ఆమె పుట్టినరోజు వేడుకలు హాట్ టాపిక్ గా మారాయి.

ఫిట్‌ నెస్‌ ఫ్రీక్

ఫిట్‌ నెస్‌ ఫ్రీక్

ఇక సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపిస్తూ చీరకట్టులో కనిపించే ప్రగతి గత ఏడాది అయితే లాక్‌డౌన్ సమయంలో ఫిట్‌ నెస్‌ మీద సూపర్ ఫోకస్ పెట్టింది. అప్పటి నుంచే ఆమె ఎక్సర్సైజులు, జుంబా డాన్స్ చేస్తున్న వీడియోలు, మామూలు డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసి మరింత క్రేజ్ సంపాదించింది. లేటు వయసులో ఘాటు అందాలతో స్టెప్పులేస్తుండటంతో పాటు హాట్ వర్కౌట్స్ చేస్తూ ఉండడంతో ప్రగతికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోతోంది.

బర్త్ డే ఫోటోలు

బర్త్ డే ఫోటోలు

తాజాగా న‌టి ప్ర‌గ‌తి బ‌ర్త్ డే జ‌ర‌గ‌గా, బర్త్ డే ఫోటోలు నెట్టింట్లో కాక పుట్టిస్తున్నాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. తన స్నేహితులరాళ్లతో కలిసి బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నట్టు ఆ ఫోటోల ద్వారా మనకి అర్ధమవుతోంది. బ్లూ కలర్ హాట్ ఔట్ ఫిట్ లో ఆమె అందాలు ఆరబిస్తూ కనువిందు చేసింది. ప్రసుతుఅనికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X