అందుకే నా భర్తతో విడిపోవాల్సి వచ్చింది.. విడాకులపై నటి ప్రగతి షాకింగ్ స్టేట్‌మెంట్‌..

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి (Pragathi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రగతి, కాలక్రమంలో తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమాలతో పాటు నిజ జీవితంలోనూ ఆమె చూపించే డిసిప్లిన్, ఫిట్‌నెస్‌పై ఉన్న కమిట్‌మెంట్ ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా మారింది. ముఖ్యంగా జిమ్ వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో యూత్‌కే షాక్ ఇస్తూ హైపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు.

ఇటీవల నటన కంటే ఎక్కువగా ఫిట్‌నెస్ కారణంగా వార్తల్లో నిలుస్తున్న ప్రగతి, తాజాగా అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గర్వకారణంగా నిలిచారు. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025 లో పాల్గొని భారత్ తరపున నాలుగు పతకాలు సాధించి సత్తా చాటారు. ఈ పోటీల్లో ప్రగతి డెడ్ లిఫ్ట్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకోగా, ఓవరాల్ విభాగంలో రజత పతకం సాధించారు. అంతేకాదు, బెంచ్ ప్రెస్, స్క్వాట్ లిఫ్టింగ్ విభాగాల్లో కూడా మరో రెండు రజత పతకాలు గెలుచుకొని తెలుగు పరిశ్రమకు, దేశానికి గర్వకారణంగా నిలిచారు. 49 ఏళ్ల వయసులోనూ నటనతో పాటు కఠినమైన శిక్షణ తీసుకుని పవర్ లిఫ్టింగ్‌లో ఈ స్థాయి విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Actress Pragathi Breaks Silence on Divorce Single Mother Struggles and Powerlifting Glory

ఇదిలా ఉంటే, తాజాగా నటి ప్రగతికి సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా విడాకులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రగతి చాలా ఏళ్ల క్రితమే తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు ఇప్పటికే ఉద్యోగంలో సెటిల్ అయ్యాడని, కూతురు అమెరికాలో జన్మించినందువల్ల అక్కడి సిటిజన్‌షిప్ ఉండటంతో యూఎస్‌లోనే సెటిల్ కాబోతుందని తెలిపారు.

నటి ప్రగతి తన విడాకుల కారణాలు చెబుతూ.. తన తల్లి సింగిల్ మదర్ అని, తాను కూడా అలాంటి పరిస్థితికి వెళ్లకూడదని మొదట్లో చాలా రాజీపడినట్లు చెప్పింది. ఫ్యామిలీ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం చాలా విషయాల్లో తాను సర్దుకుపోయానని పేర్కొన్నారు. అయితే ఒక దశ తర్వాత పరిస్థితులు తన చేతుల్లో లేకుండా వెళ్లిపోయాయని, అప్పటికి అది కంట్రోల్ తప్పిందని తెలిపారు.

'ఒక దశ తర్వాత మనం పిల్లలకు ఎగ్జాంపుల్‌గా ఉండాలి. మనల్ని చూసి వాళ్లు నేర్చుకోవాలి. కానీ ఎప్పుడూ భరించడమే, రాజీపడటమే సరైన ఉదాహరణ కాదు. అది రాంగ్ ఎగ్జాంపుల్ అవుతుంది' అని ప్రగతి చెప్పిన మాటలు ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి. ఆ కారణంగానే తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.

విడాకుల తర్వాత సింగిల్ మదర్‌గా ఎంతో కష్టపడ్డానని, అయినా పోరాడి తన పిల్లలను బాగా చదివించుకున్నానని ప్రగతి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సంపాదన విషయంలో తాను పూర్తిగా స్వతంత్రంగా ఉన్నానని, సినిమాల ద్వారా మంచి ఆదాయం వస్తోందని తెలిపారు. అవసరమైతే నటన ఆపేసినా కూడా కంఫర్ట్‌గా జీవించగల స్థాయిలో తాను ఉన్నానని చెప్పడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది.

మొత్తానికిి నటి ప్రగతి జీవితాన్ని చూస్తే.. పోరాటానికి, ధైర్యానికి, స్వతంత్రతకు ప్రతీకగా నిలుస్తోంది. నటిగా, క్రీడాకారిణిగా మాత్రమే కాదు... సింగిల్ మదర్‌గా కూడా తన జీవితాన్ని గెలిచిన మహిళగా ఆమె ప్రయాణం ఇప్పుడు ఎంతోమందికి ప్రేరణగా మారుతోందని అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: pragathi actress tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X