నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.. నటి ప్రగతి ఎమోషనల్

తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది నటి ప్రగతి ( Actress Pragathi).ఎన్నో సినిమాల్లో తల్లి, వదిన, అక్క, కుటుంబ పెద్ద పాత్రల్లో తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నది ఆమె. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ సంచలన నిర్ణయాలు, స్పష్టమైన అభిప్రాయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఫిట్‌నెస్, వర్కౌట్స్, పవర్ లిఫ్టింగ్ ద్వారా వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచారు.

కేవలం సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే ప్రగతి.. తన వ్యక్తిగత జీవితం, కెరీర్, ఫిట్‌నెస్ ప్రయాణానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తాను జీవితంలో అతిపెద్ద తప్పు చేశానని ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఈ తప్పు ఏంటీ? ఇంతకీ ఏమైంది?

Actress Pragathi Calls Marriage Her Biggest Mistake Shares Honest Views on Relationships

నటి ప్రగతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, ప్రేమ, రెండో వివాహం వంటి అంశాలపై ఆమె చేసిన ఓపెన్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంటర్వ్యూలో యాంకర్.. "ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా?" అని ప్రశ్నించగా, ప్రగతి తనదైన శైలిలో ఆసక్తికర సమాధానం ఇచ్చారు. జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన విషయమేనని అంగీకరించిన ఆమె.. తనకు మాత్రం రెండో పెళ్లి అవసరం అనిపించలేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "మళ్లీ పెళ్లి చేసుకుని, మళ్లీ పిల్లలను కనడం, వారి బాధ్యతలు తీసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. జీవితంలో ఇప్పటికే ఒక పెద్ద తప్పు చేశాను. నిజం చెప్పాలంటే మొదటిసారి పెళ్లి చేసుకోవడమే నా జీవితంలో చాలా పెద్ద తప్పు. అదే తప్పును మరోసారి చేయాలనుకోవడం లేదు. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ప్రయోజనం ఏముంటుంది?" అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

అలాగే ప్రేమ గురించి కూడా యాంకర్ ప్రశ్నించగా ఆమె మరో ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "30, 40, 50 ఏళ్ల వయసులో కూడా చాలామంది ప్రేమలో పడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?" అని అడగగా.. ప్రేమను, పెళ్లిని ఒకేలా చూడకూడదని ప్రగతి అన్నారు. "ప్రేమ అనేది పూర్తిగా వేరే విషయం. ఒకరితో మాట్లాడటం, ఒకరిని ఇష్టపడటం, ఒకరి సాన్నిహిత్యాన్ని ఆస్వాదించడం అనేది సహజమైన విషయం. కానీ ప్రేమ ఉందని తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలనే అవసరం లేదు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది" అని ఆమె వివరించారు.

ముఖ్యంగా ఒక వయసు వచ్చిన తర్వాత, పిల్లలు పెద్దవాళ్లు అయిన తర్వాత మళ్లీ పెళ్లి గురించి ఆలోచించడం తన దృష్టిలో సరైన నిర్ణయం కాదని ప్రగతి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు మారిపోయాయని, ఒంటరిగా కూడా సంతోషంగా జీవించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రగతి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X