అలా పిలిస్తే అస్సలు ఊరుకోను.. ఆంటీ కామెంట్స్‌పై నటి ప్రగతి ఫైర్
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి (Pragathi Mahavadi)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సినిమాలతో పాటు నిజ జీవితంలోనూ ఫిట్‌నెస్, డిసిప్లిన్, కఠినమైన జిమ్ వర్కౌట్స్‌తో యువతకే షాక్ ఇస్తూ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా జిమ్ వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలతో వార్తల్లో నిలుస్తున్న ప్రగతి, తాజాగా తనపై వచ్చే 'ఆంటీ' కామెంట్స్‌పై ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతిని యాంకర్.. 'చాలామంది మిమ్మల్ని ఆంటీ అని పిలుస్తారు... అది మీకు నచ్చుతుందా?'అని ప్రశ్నించారు. దీనికి ఆమె చాలా స్పష్టంగా, భావోద్వేగంగా సమాధానం ఇచ్చారు. 'మా అబ్బాయి పిల్లలందరూ నన్ను ఆంటీ అని పిలుస్తారు. అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తల్లి తర్వాత వచ్చే గౌరవప్రదమైన మాట అది. కానీ సోషల్ మీడియాలో ఆంటీ అనే మాటకు అర్థం వేరేలా మారిపోయింది' అంటూ ప్రగతి తన ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో కొందరు 'ఆంటీ' అనే పదాన్ని ద్వందార్థాలతో, చాలా చీప్‌గా వాడుతున్నారని ప్రగతి మండిపడ్డారు. 'ఓ తల్లిలాంటి దానిని నువ్వు అలా వేరే ఆలోచనతో ఎలా మాట్లాడతావు? అప్పుడు కచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. ఆంటీ అనే మాటలో తప్పు లేదు... కానీ చెప్పే విధానంలో మార్పు ఉంది' అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ.. 'ఆంటీ కాకుండా అమ్మ అనండి, అమ్మమ్మ అనండి... నాకు ఏ అభ్యంతరం లేదు. నా వయసును దాచుకోవడానికి నేను యంగ్‌ని అని నటించను. ఏజ్‌ను ప్రౌడ్‌గా ఓన్ చేసుకుంటాను. కానీ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మాత్రం అస్సలు నచ్చదు. నేను ఇతరులకు గౌరవం ఇస్తాను కాబట్టి అదే గౌరవం తిరిగి ఆశిస్తాను' అని ప్రగతి స్పష్టం చేశారు.
చివరగా, 'అనవసరంగా, అవమానకరంగా అలా పిలిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను' అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. 'ఇండస్ట్రీలో ఎంత గుర్తింపు ఉన్నా అవకాశాల కోసం వేరే వాళ్లను అడగాల్సి వస్తుందంటారు... అది నిజమేనా?' అని ప్రశ్నించారు. నటి ప్రగతి మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు నా వృత్తి సాక్షిగా నేను ఎవరికీ ఫోన్ చేసి అవకాశాలు అడగలేదు' అని చెప్పారు. ఒక క్యారెక్టర్‌కు తాను సెట్ అవుతానని మూవీ మేకర్స్ భావిస్తే, వాళ్లే తనకు ఫోన్ చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. 'నాకు అడగడం వల్ల క్యారెక్టర్ రావడం కన్నా, వాళ్లే నన్ను గుర్తించి పిలవాలి. అడిగితే నాకు నేను తక్కువ చేసుకున్నట్టే అనిపిస్తుంది'అంటూ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇంకా మాట్లాడుతూ.. 'ఇది నా పర్సనల్ స్టాండ్. అందరూ ఇదే ఫాలో కావాలని కాదు. కానీ ఇప్పటివరకు నేను ఎవరిని అడిగింది లేదు. ఏదైనా పాత్రకు నేను అర్హురాలిని అయితే, కచ్చితంగా నన్నే పిలుస్తారు అనే నమ్మకం నాకుంది' అని చెప్పారు. ప్రగతి చేసిన ఈ వ్యాఖ్యలు మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అవమానకర వ్యాఖ్యలపై మరోసారి చర్చను తెరపైకి తెచ్చాయి. ప్రస్తుతం ప్రగతి మాటలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. చాలా మంది ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా.. మరికొందరు సోషల్ మీడియాలో మహిళల పట్ల ఉండాల్సిన గౌరవంపై చర్చ మొదలుపెట్టారు. మొత్తానికి 'ఆంటీ' కామెంట్స్‌పై ప్రగతి చేసిన ఈ ఫైర్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











