నెల అంతా ఒకటే చీర కట్టుకుంటావా.. ట్రోలింగ్‌పై నటి ప్రగతి స్ట్రాంగ్ రియాక్షన్
ఒకప్పుడు అత్త, అమ్మ, వదిన పాత్రలతో ఇండస్ట్రీలో తన హవా సాగించారు నటి ప్రగతి. హీరోయిన్లే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడంతో ప్రగతి వంటి వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. మారుతున్న కాలానికి తగినట్లుగా నటీనటులు కూడా మారాల్సి ఉంటుంది. లేదంటే జీవితంలో ఎదుగుదల ఉండదు. ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు నటి ప్రగతి. సినిమాలకు కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చిన ఆమె 50 ప్లస్ ఏజ్‌లో, అది కూడా మహిళ అయ్యుండి వెయిట్ లిఫ్టర్‌గా మారిపోయారు. అంతేకాదు.. అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని భారతదేశానికి పతకాలు సైతం సాధించి శెభాష్ అనిపించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో ప్రతి అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యారు ప్రగతి. తను అనుకున్న పాత్రలు రాకపోవడంతో పాటు జీవితంలో కొత్తగా ఏదైనా చేయాలి, ఆత్మ సంతృప్తిని సాధించాలనే ఉద్దేశంతోనే తాను ఈ రంగాన్ని ఎంచుకున్నట్లు పలుమార్లు తెలిపారు ప్రగతి. పవర్ లిఫ్టింగ్‌లో ఉంటూనే తనకెంతో ఇష్టమైన నటన వైపు రీ ఎంట్రీ ఇచ్చారు ఈ సీనియర్ నటి. తెలుగు, తమిళ భాషలలో పలు చిత్రాలలో నటిస్తున్నారు.

సినిమా వాళ్లు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు అని బయట అందరూ అనుకుంటారని యాంకర్ అడగ్గా.. అలాంటిదేం ఉండదు నా బొంద, ఖర్చే ఎక్కువ ఉంటుంది. మెయింటైనెన్స్‌కే పోతుంది అంతా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి ఈ శారీ వాడాను. ఇది ఇప్పుడు దగ్గర దగ్గర ఒక నెల ఇదే రోటేట్ అవుతూ ఉంటుంది. ఇందులో ఎన్నో థంబ్‌నైల్స్, హెడ్డింగ్‌లు పెడతారో నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఈ శారీ క్లిప్స్ రూపంలో నెల రోజుల పాటు రోటేట్ అవుతుంది. నిజానికి ఈ శారీని మళ్లీ నేను రిపీట్ చేయను.
నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే.. ఎందుకంటే నేను పబ్లిక్ లైఫ్‌లో ఉన్నాను కాబట్టి. ఇది అనుకున్నంత తేలిక కాదు.. చాలా కష్టం. ఆఫీస్‌కి వెళ్లే సాధారణ వ్యక్తిలా.. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నవారు డబ్బుని దాచుకోవడం కుదరదు. హౌస్‌వైఫ్స్‌తో నేను కంపేర్ చేయడం లేదు.. కేవలం ఆఫీస్‌కి వెళ్లే వారి గురించి చెబుతున్నాను. పబ్లిక్ అప్పీయరెన్స్‌లో మనం ఒక్కసారి వేసుకున్నామంటే అదే డ్రెస్, శారీ వేసుకుని తిరుగుతున్నామని హెడ్డింగ్స్ పెట్టేస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ అంటే మాకు చాలా కష్టం.. ఈ మెయింటైనెన్స్ చేయాల్సిందే. చిన్న చిన్న విషయాలపైనా శ్రద్ధ పెట్టాలి.. నెయిల్ పాలీష్ నుంచి చెప్పులు అన్నింటిపైనా ఫోకస్ చేయాలని ప్రగతి చెప్పారు.
నా డ్రెస్ చూసి నా క్యారెక్టర్‌ని కొందరు అంచనా వేస్తుంటారు. డ్రెస్ చూసి అమ్మానాన్నలు, బ్యాక్‌గ్రౌండ్ అంతా వచ్చేస్తుంది. కానీ ఇందులో ఏం తెలియదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ? నా పిల్లలు ఏంటీ? నేనెంటీ? ఏం పట్టించుకోకుండా మాట్లాడతారు. ఇలాంటి విషయాలపై ముందు రోజుల్లో బాధపడ్డాను. ఏం తెలియకుండా అసలు ఎలా నన్ను జడ్జ్ చేస్తారు. ఆ నెగిటివ్ కామెంట్స్ చాలా బాధపెట్టాయి. ఇప్పుడు మాత్రం అలాంటివి వస్తే బ్లాక్ కొట్టేస్తా. కర్మని 200 శాతం నమ్ముతా. మనం చేసిన దానికి పదిరెట్లు ఎక్కువగా కొడుతుంది. ఒకరిని ఒక మాట అనేయడం చాలా ఈజీ. అది తిరిగొచ్చేటప్పుడు ఆ బాధ తెలుస్తుంది. ఒక మాట కామెంట్ పెడితేనే మనకి అంత కష్టంగా ఉన్నప్పుడు ఒకరిని ఒక మాట అనేటప్పుడు మనం ఎంత ఆలోచించాలని ప్రగతి ప్రశ్నించారు.
మనిషి అన్నాక గోల్స్ పెట్టుకోవాలి, ఏదో ఒక పనిచేయాలి. కెరీర్, ఫ్యామిలీలని చూసుకోవాలి. అంతేకానీ అమ్మాయి, అబ్బాయిలు ముఖ్యం కాదు. ఒకరోజులో అన్నం తినాలి, స్నానం చేయాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, పనికి వెళ్లాలి, బ్రష్ చేసుకుని మళ్లీ పడుకోవాలి. ఇన్ని పనులు ఉన్నప్పుడు ఒకటే పని చేస్తూ కూర్చోలేం కదా. మనం చేసే తప్పుకు ఎదుటి మనిషిని నిందిస్తాం.. నీ మూలంగా నేను ఇలా అయ్యాను, నీ మూలంగా నేను నా టైం వేస్ట్ చేసుకున్నా అంటారు. కానీ నువ్వు చేసుకుంటున్నావు, ప్రేమలో ఉన్నప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ పనులన్నీ మానుకుని ఇవ్వాల్సిన అవసరం లేదని యువతకు, ప్రేమలో ఉన్నవారికి ప్రగతి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications



