ఆ యాక్టర్ నన్ను క్యారవ్యాన్ లోకి పిలిచి అసభ్యంగా.. నటి ఎమోషనల్ కామెంట్స్..
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కొత్తగా సినిమాలలో నటించాలని భావించిన వారికి ఇదో పెనుభూతం లాగా కనిపిస్తుంది. దీంతో కొంతమంది యాక్టరెస్ట్ తమ కోరికలను చంపుకుంటూ వేరే ఫీల్డ్ కి వెళ్లిపోతున్నారు. మరి కొందరు మాత్రం ఎలాగైనా ఇండస్ట్రీలో రాణించాలని, ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొంటూ అవకాశాలు కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. తాజాగా సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ ప్రారంభంలో ఓ సీనియర్ నటుడు తనని కేరవాన్ లోకి పిలిచి, అసభ్యకరంగా ప్రవర్తించాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ సీనియర్ నటి ఎవరు? అసలేం జరిగింది? వివరాల్లోకెళ్తే
ఆ సీనియర్ నటి ఎవరో కాదు టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి (Pragathi). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. ప్రస్తుతం గ్లామర్ నటి హీరో, హీరోయిన్లకు అమ్మగా లేదా అత్తగా నటిస్తూ తన పాత్రల్లో ఒదిగిపోతుంది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి..తనకంటూ ఓ ప్రత్యేక పాపులారిటీ సంపాదించుకుంది నటి ప్రగతి.

చాలామంది లాగానే నటి ప్రగతి కూడా హీరోయిన్ అవ్వాలని సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ, ఆమె అనుకున్న విధంగా తన కెరీర్ సాగలేదు. ఈ అమ్మడు తమిళ డైరెక్టర్ కె భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇట్లా విశేషంగా' అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. అయితే.. ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత సరేనా విధంగా అవకాశాలు రాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాల్సి వచ్చింది. ఇలా తమిళం, మలయాళం సినిమాలలో నటించి సౌత్ ఆడియన్స్ కు దగ్గర అయింది నటీ ప్రగతి. కానీ, సరైన అవకాశాలు రాకపోవడం కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమైంది.
అ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది నటి ప్రగతి. వరుస అవకాశాలు అందుకుంటూ సక్సెస్ పుల్ గా తన కెరీర్ లో దూసుకెళ్తుంది. నటి ప్రగతి ప్రొఫెషనల్ లైఫ్ ఎంత సక్సెస్ గా సాగిపోతుందో .. పర్సనల్ పర్సనల్ లైఫ్ లో మాత్రం పలు ఛాలెంజ్లను ఎదుర్కొంది. కేవలం 19 ఏళ్లకే పెళ్లి కావడం, చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలు , ఆ తర్వాత అభిప్రాయ భేదాలతో భర్త తనని విడిచి వెళ్లిపోవడం, అత్తగారి కుటుంబం తనని వెళ్ళగొట్టడం, దీంతో పిల్లల బాధ్యతలు ఆమెపైనే పడటం.. ఇలా సినీ కష్టాలు లాగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది ప్రగతి.

నటి ప్రగతి కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాని కాకుండా ఈ మధ్యకాలంలో పవర్ లిఫ్టింగ్ పై కూడా ఫోకస్ పెడుతుంది. పలు కాంపిటీషన్లో నటించి యూత్ కూడా సవాల్ విసురుతుంది. గత ఏడాది జరిగిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ కాంపిటీషన్స్ లో పాల్గొని తన సత్తా చాటింది. ఈ పోటీల్లో మూడో స్థానంలో నిలిచింది నటి ప్రగతి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గ్లామర్ బ్యూటీ .. నిత్యం తన పర్సనల్ లైఫ్ అప్డేట్స్ ఇస్తూ తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఫిట్నెస్ వీడియోస్, డాన్సులు పెడుతూ సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను సంపాదించుకుంది నటి ప్రగతి.
ఇదిలా ఉంటే నటి ప్రగతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను కూడా ఓ సినిమా షూటింగ్ సమయంలో కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని, ఓ సీనియర్ నటుడు తనతో అసభ్యకరంగా వ్యవహరించాడని చెప్పుకొచ్చింది. నటి ప్రగతి మాట్లాడుతూ.. ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు ఓ సీనియర్ నటుడు చేసిన పనికి తాను చాలా ఇబ్బంది పడ్డానని ,ఆ ఘటనతో తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని తెలిపారు. ఆ నటుడు అంత ముందుకు తనతో చాలా పద్ధతిగా ఉండేవారని, కానీ, సడన్గా రోజు మాత్రం అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది.
ఆ ఘటన తనని ఎంతో బాధ పెట్టిందని ఆ రోజు యాక్టింగ్ గాని, షూటింగ్ లో పాల్గొనాలనిపించలేదని, సరిగ్గా భోజనం కూడా చేయలేకపోయానని నటి ప్రగతి ఎమోషనల్ అయ్యారు. ఏది ఏమైనా సాయంత్రం షూటింగ్ ప్యాకప్ చెప్పిన తర్వాత తనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నానని నటి ప్రగతి తెలిపింది. అతని షూటింగ్ అయిపోయిన తర్వాత.. తనతో మాట్లాడాలని రిక్వెస్ట్ చేశాను. దీంతో అతడు తన క్యారెవ్యాన్ లోకి రమ్మని పిలిచారు. వెంటనే వెళ్లి తన ముందు కూర్చున్నాను. ఆ సమయంలో అతను తప్పు చేశానని టెన్షన్ పడుతున్నారు. కానీ బయటికి తెలియలేదు. అయినా ఎలాగైనా నిలదీయాలని ఫిక్స్ అయ్యాను అన్నారు.

'మీతో ఎప్పుడైనా నేను తప్పుగా బీహెవ్ చేశానా? నాకు తెలుసు గాని తెలియకుండా గాని మీకు ఏమైనా రాంగ్ సిగ్నల్ ఇచ్చానా? అని ప్రశ్నించాను. దీంతో ఆ యాక్టర్ మరింత షాక్ అయ్యారు. 'అలా ఎందుకు అడుగుతున్నావ్? ' అంటూ తిరిగిన నన్నే ప్రశ్నించాడు ఆ నటుడు. దీంతో 'మరి షూటింగ్లో అలా ప్రవర్తించారు? నేను తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. మీ పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారైనా ఆలోచించారా? అని అడగడంతో ఆ నటుడు మరింత టెన్షన్ పడ్డాడరని తెలిపింది.
'మీరు అలా కావాలని చేసి ఉండరని నాకు తెలుసు..నా నుంచి ఏదైనా తప్పు జరిగిందా? అనే విషయం తెలుసుకోవడానికి ఇలా ప్రశ్నిస్తున్నానని మరోసారి క్లారిటీ గా అడిగాను. దీంతో ఆనటుడు 'సరే సరే..' అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడని తెలిపింది నటి ప్రగతి. కానీ,ఆ నటుడు తనపై లేనిపోని ఆరోపణలు చేశారని, తనకి ఆటిట్యూడ్ ఎక్కువ అని, ఓవర్ చేస్తుందని, పొగరుబోతు అని పలు రూమర్స్ క్రియేట్ చేశారని, ఇతరులతో తనకు రిలేషన్ ఉందంటూ రూమర్స్ క్రియేట్ చేశారని పవిత్ర ఎమోషనల్ అయింది.
అయితే ఆ నటుడు ఎవరు? అది ఏ సినిమా షూటింగ్ సమయంలో జరిగిందో మాత్రం చెప్పడానికి ఇష్టపడలేదు. ఏదేమైనా సెకండ్ గ్రేడ్ నటులు ఇప్పటికి కూడా కాస్టింగ్ కావచ్చు ఏరుకుంటున్నారనే చెప్పాలి. అవకాశాల పేరిట నటులను తమ అవసరాలకు వాడుకుంటున్నారని, ఇప్పటికి ఎంతోమంది మంది మీడియా ముందు ఓపెన్ గాని స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోవాలని పలువురా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











