Pragathi: క్యారవ్యాన్‌లో పిలిచి ఆ యాక్టర్ అసభ్యంగా.. ప్రగతి షాకింగ్ కామెంట్స్
Actress Pragathi: టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుత హీరో, హీరోయిన్లకు అమ్మగా అయినా.. అత్తమ్మగా అయినా.. లేదా అక్క అయినా .. తదితర హెల్పింగ్ రోల్స్ కు ఫస్ట్ ఛాయిస్ ప్రగతి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగతి తన సినిమా అప్డేట్స్ వివరాలు, అలాగే జిమ్ వీడియోలు, ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభంలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
చాలా మంది లాగే నటి ప్రగతి కూడా హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది. తమిళ డైరెక్టర్ కె.భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన వీట్ల విశేషంగా అనే సినిమాలో హీరోయిన్‌గా తన సినీ కెరీర్‌ను మొదలు పెట్టి విజయవంతంగా రాణించింది. ఇటు తెలుగులో నటిస్తూనే.. అటు తిమళ్, మలయాళీ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే.. కొన్ని కారణాలతో సినిమాలకు దూరమైంది.
అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ.. మళ్లి తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది.

ప్రస్తుతం హీరోలు, హీరోయిన్లకైనా అమ్మ, అత్తమ్మ తదితర సహాయక పాత్రలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ అనే మారింది.నటి ప్రగతి ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ అయినా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఎదురు దెబ్బలే తగిలాయి. ప్రగతికి కేవలం 19 ఏండ్లలోనే పెళ్లి కావడం.. చిన్న వయస్సులోనే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారడం. అభిప్రాయ భేదాలు రావడంతో తన భర్త తనని వీడి పెట్టి వెళ్లిపోవడంతో ఇద్దరు పిల్లల బాధ్యతను ఆమెనే తీసుకుంది. ఒంటరి మహిళగా ప్రగతి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి ప్రగతి.. ఈ మధ్యకాలంలో ప్రగతి వర్కవుట్స్ చేస్తూ.. పవర్ లిఫ్టింగ్ ఫోకస్ పెడుతోంది. యూత్ కూడా ఛాలెంజ్ లు విసురుతూ ఈ విభాగంలోట్రోఫీలు కూడా గెల్చుకుంటోంది. గత ఏడాది బెంగళూరులో జరిగిన పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో పాల్గొని సత్తా చాటింది. ఈ నటి 3వ స్థానంలో నిలిచింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి ప్రగతి .. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. ఫిటినెస్ వీడియోలతో పాటు పలు డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు.
ఇదిలాఉంటే.. నటి ప్రగతి ఇటీవల ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ.. తాను ఓ సినిమా షూటింగ్ సమయంలో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు గురయ్యానని తెలిపారు. ఓ సీనియర్ నటుడు చేసిన ఓ పనికి తనకు ఏం చేయాలో అర్థం కాలేదని తెలిపారు. ఆ ఘటనతో తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. ఆ యాక్టర్ తనతో చాలా పద్దతిగా ఉండేవారని, అసలేమైందో తెలియదు.. ఓ రోజు సెట్లో అసభ్యంగా ప్రవర్తించాడనీ, ఆ ఘటన తనని చాలా పెట్టిందని తెలిపారు. ఆ రోజు షూటింగ్‌లో యాక్ట్ చేయాలని అనిపించలేదని, ఆ బాధతో భోజనం కూడా చేయాలనిపించలేదన్నారు.

సాయంత్రం వేళ తనతో మాట్లాలని నిర్ణయించుకున్నాననీ, మీతో మాట్లాడాలని ఉందని రిక్వెస్ట్ చేయగా.. తనని క్యారవ్యాన్ లోకి పిలిచారనీ, తాను వెంటనే ఆయను ముందు కూర్చొన్నానని తెలిపారు. ఈ క్రమంలో 'మీతో ఎప్పుడైనా.. నేను మిస్ బిహేవ్ చేశానా , నాకు తెలుసు గాని తెలియగానే నా నుండి మీకు ఏమైనా రాంగ్ సిగ్నల్స్ వచ్చాయా, లేదా ఏమైనా బ్యాడ్ గా వ్యవహరించానా? ' అని ప్రశ్నించానన్నారు. దీంతో ఆ యాక్టర్ కంగుతున్నారని, అలా ప్రశ్నించారేంటి అని నన్నే తిరిగి ప్రశ్నించారని తెలిపింది.
'మరి షూటింగ్లో అలా ప్రవర్తించారు ఏంటి ? నేను తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఎలా ఉండేదని, ఒక్కసారి అయినా ఆలోచించారా?' అని అనడంతో.. ఆ నటుడు నీళ్లు మింగారని తెలిపారు నటి ప్రగతి. 'మీరు అలా చేయరని తెలుసు.. కానీ నా సైడ్ నుండి ఏమైనా తప్పుందా? అనే విషయం తెలుసుకోవడానికి తాను ఇలా ప్రశ్నించానని, మరోసారి క్లారిటీ ఇచ్చానన్నారు. 'నీతో ఆ నటుడు సరే.. సరే..' అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారని తెలిపింది. కానీ ఆ నటుడే తనకి ఆటిట్యూడ్ ఎక్కువ అని, ఓవర్ చేస్తుందని, పొగరుగా వివరిస్తుందని పలువురుతో నాపై బ్యాడ్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయని ప్రగతి ఎమోషనల్ అయింది. అయితే ఆ నటుడు ఎవరో అనేది తెలుపలేదు.


Click it and Unblock the Notifications











