వేణు స్వామిపై నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్.. చెమటలు చిందిస్తేనే అంటూ..
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ( Pragathi) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రగతి, కాలక్రమేణా తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సినిమాల్లోనే కాదు... నిజ జీవితంలోనూ తన ఫిట్‌నెస్, డిసిప్లిన్, కఠినమైన వర్కౌట్స్‌తో యూత్‌కే షాక్ ఇస్తూ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు.
ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా జిమ్ వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలతో వార్తల్లో నిలుస్తున్న ప్రగతి... తాజాగా తనపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venus Swami) చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్, 'స్వామిగారు చేసిన పూజల వల్లే మీకు వెయిట్ లిఫ్టింగ్‌లో మెడల్స్ వచ్చాయని అంటున్నారు' అని ప్రశ్నించగా... ప్రగతి ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ప్రశ్నకు స్పందించిన ప్రగతి, 'రెండు సంవత్సరాల క్రితం నాకు చాలా బ్యాడ్ టైమ్ నడిచింది. ఆ సమయంలో దేవుడు, దయ్యాలు... దారాలు, పోగులు, రాళ్లు, రప్పలు అన్నీ నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే కొంతమంది ద్వారా వేణు స్వామి గురించి తెలిసింది. రెఫరెన్సులతో ఆయన వద్దకు వెళ్లాం. మాకు పూజలు చేశారు... కానీ ఆ పూజల ఫలితం నాకు అంతగా కనిపించలేదు' అంటూ స్పష్టంగా చెప్పారు.
అంతేకాదు...'ఆయన పూజల వల్లే నాకు మెడల్స్ వచ్చాయని చెప్పడం పూర్తిగా తప్పు. ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వలేను, ఎవరూ తీసుకోవద్దు. నేను నా ఒళ్ళు ఓనం చేసుకొని, రెక్కలు ముక్కలు చేసుకుంటూ, రోజూ చెమట చిందించి, కష్టపడి సాధించిన విజయాలు అవి. నా కష్టానికి విలువ ఇవ్వండి. ఇందులో వేరే ఎవరికీ సంబంధం లేదు' అంటూ భావోద్వేగంగా స్పందించారు. ఈ విషయంలో ఎవరైనా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే బాగోదని ఆమె హెచ్చరించారు.
ఇలాంటి పూజలు, నమ్మకాలు మీరు నమ్ముతారా? అని యాంకర్ ప్రశ్నించగా, 'కొన్నిసార్లు మన టైం బాగాలేనప్పుడు కొన్ని నమ్మాల్సి వస్తుంది. పరిస్థితులు అలాంటివి చేయిస్తాయి' అని ఓపెన్ గా చెప్పుకొచ్చారు. అలాగే, మందు, చికెన్ లాంటి మాంసాహారంతో పూజలు చేస్తారన్న ప్రచారంపై స్పందిస్తూ... 'వేణు స్వామి పూజ విధానం గురించి నాకు ముందుగా అంతగా తెలియదు. పూజ చూసిన తర్వాత షాక్ అయ్యాను. అయితే ఒక్కొక్కరి పూజా విధానం ఒక్కొక్కలా ఉంటుందిగా అని అనుకున్నాను. నార్త్ ఇండియాలో ఇలాంటి విషయాలను చాలా మంది నమ్ముతారు. చాలామంది ఎక్కువగా పాటిస్తారని నాకు తెలుసు. అందుకే అప్పట్లో ఎక్కువగా మాట్లాడలేదు' అన్నారు.
ఆయన చెప్పినట్లుగా ఎన్నో పూజలు, క్రతువులు చేసినప్పటికీ... తనకు ఎలాంటి స్పష్టమైన ఫలితం కనిపించలేదని ప్రగతి వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు... సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవైపు సెలబ్రిటీల జ్యోతిష్య నమ్మకాలపై చర్చ జరుగుతుండగా, మరోవైపు "కష్టం ముందు... పూజలు తర్వాత" అన్న ప్రగతికి అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. అయితే.. జ్యోతిష్యుడు వేణుస్వామి ఎలాంటి కామెంట్స్ చేశారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











