Don't Miss!
- News
బాలకృష్ణకు `కాపు`నాడు వార్నింగ్: పెదవి విప్పని పవన్- `పొత్తు` పోతుందనే భయం..?!
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Pragya Jaiswal: మరోసారి బికినీ సైజ్ తగ్గించిన అఖండ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్ స్టిల్
కొంతమంది హీరోయిన్స్ మొదట్లో కనిపించినట్లుగా ఆ తర్వాత మరికొన్నాళ్లకు కనిపించరు. ముఖ్యంగా గ్లామర్ విషయంలో అయితే చాలా మార్పులు చేస్తూ ఉంటారు. ఇక కొందరు అయితే బికినీలో ఊహించిన విధంగా దర్శనమిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తారు. ఇక కంచె సినిమా ద్వారా ట్రెడిషనల్ హీరోయిన్ గా ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రగ్యా జైస్వాల్ ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ గట్టిగానే పెంచుతొంది. ఇక రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో బికినీ సైజును ఇంకాస్త తగ్గించేసి ఊహించని విధంగా షాక్ ఇచ్చింది అని చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళితే..

కంచె సినిమాతో
తెలుగులో మొదట్లో కాస్త చిన్న సినిమాల్లో నటించిన ప్రగ్యా జైస్వాల్ మొదటిసారి 2015లో కంచె సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమాలో ఆమె హోమ్లీ గా నటించిన విధానం ఓవర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తర్వాత మంచు మనోజ్ గుంటూరోడు సినిమాతో కమర్షియల్ గా పరవాలేదు అనే విధంగా మరొక సక్సెస్ అయితే అందుకుంది.

మొదట మోడల్ గా..
పూణే కు చెందిన ప్రగ్యా జైస్వాల్ 2013లోనే మోడల్ గా కెరియర్ ను ప్రారంభించి ఆ తర్వాత పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపించింది. ఇక నార్త్ సినిమా ఇండస్ట్రీలో కొన్ని చిన్న సినిమాల్లో అవకాశాలు వస్తున్న సమయంలోనే ఎక్కువగా టాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఫోకస్ చేసింది. ఇక కన్నడలో కూడా ఛాన్స్ లు వచ్చాయి కానీ ఆమెకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు దొరకకపోవడంతో అటువైపు పెద్దగా ఫోకస్ చేయలేదు.

చదువులో బెస్ట్ స్టూడెంట్
ప్రగ్యా జైస్వాల్ చదువులో కూడా నెంబర్ వన్. ఆమె స్కూల్ అలాగే కాలేజీలో కూడా టాపర్ గా నిలిచెదట. ఇక లాయర్ గా కోర్టులో వాదించాలని అనుకున్నా ఆమె విజయవంతంగా లా కోర్సును కూడా పూర్తి చేసింది. కానీ ఆ తర్వాత మళ్లీ మోడల్ గా గుర్తింపునందుకొని ఫోకస్ మొత్తం నటన పైనే పెట్టింది. పలు కమర్షియల్ యాడ్స్ లలో కూడా నటించింది.

అఖండ సినిమాతో బిగ్ సక్సెస్
కంచె సినిమాతో ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమ చాలా దగ్గరయిపోయింది. ఆ తర్వాత అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ కమర్షియల్ గా మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి. వరుసగా కొన్ని సినిమాలు అయితే దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ఇక 2021 లో బాలకృష్ణతో చేసిన అఖండ సినిమా మాత్రం ఆమెకు మంచి విజయాన్ని అందించింది. కానీ ఆ తర్వాత వచ్చిన సన్నాఫ్ ఇండియా మాత్రం ఊహించని ఫలితాన్ని ఇచ్చింది.

బికినీలో షాకింగ్ స్టిల్
అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆమె బికినీ అందాలతో ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. రీసెంట్ గా నల్లని బికినీలో ప్రగ్యా జైస్వాల్ గతంలో ఎప్పుడూ లేనంత ఘాటైన లుక్కుతో కనిపించింది. ఒక విధంగా బికినీ సైజ్ ఇంకాస్త తగ్గిపోయినా చాలా అందంగా స్టిల్ ఇచ్చినట్లుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి అందాల ఆరబోతతో ప్రగ్యాస్వాల్ ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.