జీవితం చేసిన మిరాకిల్ .. డాకు మహారాజ్ తర్వాత ప్రగ్య ఆస్తులు ఎన్ని కోట్లంటే?

కష్ట సుఖాలు కలిస్తేనే జీవితం. ప్రతి నిత్యం ఇక్కడ పరుగు పందెమే. చివరి వరకు పోరాడేవాడే ఇందులో విజేత. రేసులో వెనుకబడిన వాడు అడ్రస్ ఉండడు. కష్టానికి , బాధలకు భయపడి పారిపోతే జీవితం ఎప్పటికీ సాఫీగా నడవదు. వాటిని ధైర్యం ఎదుర్కొని నిలబడిన వాడిని ఏ కష్టం ఏం చేయలేదు. ఇలా ఎన్నో తట్టుకుని నిలబడి , ప్రస్తుతం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.

ఒకప్పుడు వరుస ఆఫర్లతో స్టార్ రేసులో దూసుకెళ్లిన ఈ ముద్దుగుమ్మ తర్వాత అడ్రస్ లేరు. కెరీర్ ఫేడ్ అవుట్ అయిపోయింది అనుకున్న సమయంలో , అవమానాలను, చీత్కారాలను ఎదుర్కొని ఇప్పుడు చేతి నిండా ఆఫర్లతో మళ్లీ బిజీగా మారారు ప్రగ్యా జైస్వాల్. 1991 జనవరి 12న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించారు ప్రగ్య. పూణేలో లా చదివిన ఈ ముద్దుగుమ్మ చదువు పూర్తి చేసిన అనంతరం మోడలింగ్‌లో దిగారు. మోడల్‌గా దేశంలోని పలు టాప్ బ్రాండ్స్‌కు చెందిన వాణిజ్య ప్రకటనల్లో నటించారు.

Actress Pragya Jaiswal net worth and Assets Details

అలా నటనపై ఆసక్తితో సినీరంగ ప్రవేశం చేసిన ప్రగ్యా జైస్వాల్.. 2014లో విరుట్టు అనే తమిళ్ సినిమాతో తొలిసారిగా ముఖానికి రంగేసుకున్నారు. ఆ తర్వాత 2015లో బిగ్‌బాస్ విజేత అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో తెలుగువారిని పలకరించారు ప్రగ్యా జైస్వాల్. ఈ క్రమంలో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచెతో ప్రగ్యా బ్రేక్ అందుకున్నారు.

కంచె తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. ఫేడ్ అవుట్ అవుతున్న దశలో టాలీవుడ్ నుంచి పెట్టే బేడా సర్దేసిన సమయంలో అఖండతో బౌన్స్ బ్యాక్ అయ్యారు ప్రగ్యా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మళ్లీ ఆమె ఒక ఊపు ఊపుతారని అనుకున్నా తిరిగి కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఇలాంటి దశలో మళ్లీ నందమూరి బాలకృష్ణ పిలిచి మరి డాకు మహారాజ్‌లో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని దూసుకెళ్తోంది. దీనితో పాటు అఖండ 2, టైసన్ నాయుడు చిత్రాల్లో ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.

Actress Pragya Jaiswal net worth and Assets Details

కాగా.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన ప్రగ్యా జైస్వాల్ సినిమాలు ఉన్నా లేకున్నా తన సంపాదనను తెలివిగా పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నారట. ఈమె సినిమాలను మాత్రమే నమ్ముకోకుండా మోడల్‌గా పలు బ్రాండ్స్‌కి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. అలాగే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన గురించి, తన వంటకాల గురించి ఎన్నో విశేషాలను పంచుకుంటూ ఉంటారు. అలా ఏడాదికి రూ.9 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారట ప్రగ్యా జైస్వాల్. అలా మొత్తంగా ఇప్పటి వరకు రూ. 50 కోట్ల వరకు విలువైన ఆస్తులను ప్రగ్యా జైస్వాల్ కూడబెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్.

ముంబైలో ఖరీదైన ఫ్లాట్‌తో పాటు పలు లగ్జరీ కార్లు కూడా ప్రగ్యా జైస్వాల్ సొంతం చేసుకున్నారు. ఇవాళ ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు.. ఈ రోజే ఆమె హీరోయిన్‌గా నటించిన డాకు మహారాజ్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆమె ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రగ్యా జీవితంలో మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటోంది ఫిల్మీబీట్.

More from Filmibeat

Read more about: pragya jaiswal movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X