శృతి మించిన అఖండ హీరోయిన్ హాట్ షో: వామ్మో గీత దాటేసిందిగా!
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు తెగ సందడి చేస్తున్నారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తున్నారు. మరికొందరు మాత్రం అన్నీ ఉన్నా అవకాశాలను పెద్దగా దక్కించుకోవడం లేదు. అలాంటి వారిలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించే ఈ భామ.. అదృష్టం లేక ఇబ్బందులు పడుతోంది. అయితేనేం కెరీర్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రగ్యా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసం!

అప్పుడే ఎంట్రీ.. జాతీయ అవార్డు
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ప్రగ్యా జైస్వాల్ మోడల్‌గా మెప్పించింది. ఈ క్రమంలోనే 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో రిలీజ్ అయింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు'తో ప్రగ్యా తెలుగులోకి ఎంటరైంది. ఆ తర్వాత 'కంచె' మూవీ చేసి నేషనల్ అవార్డును ఒడిసిపట్టుకుంది.

ఎన్నో సినిమాలు... హిట్లు లేవుగా
'కంచె' మూవీ తర్వాత ప్రగ్యా జైస్వాల్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో ఆమె వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. అందులో 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఫలితంగా టాలెంట్ ఉన్నా హిట్లను అందుకోలేకపోయింది. ఫలితంగా చాలా ఇబ్బందులు పడింది.

అఖండ సక్సెస్... అది డిజాస్టర్
టాలీవుడ్‌లో పెద్దగా విజయాలను సొంతం చేసుకోలేకపోయిన ప్రగ్యా జైస్వాల్.. గత ఏడాది బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ప్రగ్యా ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించింది. ఈ సినిమా బిగ్ హిట్‌గా నిలిచింది. ఇదే ఆమె కెరీర్‌లో పెద్ద సక్సెస్‌గా నిలిచింది. ఆ తర్వాత ప్రగ్యా చేసిన 'సన్ ఆఫ్ ఇండియా' మాత్రం పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

సినిమాల్లేవు.. పర్సనల్ టూర్లతో
'అఖండ' వంటి బిగ్ సక్సెస్ తర్వాత కూడా ప్రగ్యా జైస్వాల్ ఆఫర్లను పెద్దగా అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేకుండా పోయాయి. కానీ, ఈ మధ్య సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. ఇది సూపర్ హిట్ అయింది. దీని తర్వాత ఖాళీ అయిన ప్రగ్యా వరుస టూర్లతో గడుపుతోంది. ఇందులో భాగంగానే ఆమె యమ ఎంజాయ్ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా
చాలా కాలం పాటు ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసినా.. ఈ మధ్య వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ అందాల వల
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. కొంత కాలంగా ఆమె ఇందులో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన క్లీవేజ్ భాగాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా ప్రగ్యా తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతోంది.

ప్రగ్యా హాట్ ఫొటోలు వైరల్‌గా
తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్లీవేజ్ షో చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే బాగా వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











