ఒకే రోజు రెండు శుభకార్యాలు చేసిన పవన్ హీరోయిన్ .. తల్లైనా తగ్గడం లేదుగా!!

అందం అభినయం రెండూ సమపాళ్లలో ఉన్నప్పటికీ ఎందుకో కన్నడ కస్తూరి ప్రణీతకు స్టార్ స్టేటస్ దక్కలేదు. కలువల్లాంటి కల్లు, వైట్ స్కీన్‌టోన్‌తో పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకుంది. కానీ చేతిలో మాత్రం అవకాశం లేదు. పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ప్రణీత. నిత్యం మన చుట్టూ సమాజంలో జరిగే అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారామె. తాజాగా పండుగ పూట ప్రణీత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు బ్లాక్‌బస్టర్ మూవీ పోకిరికి కన్నడ వెర్షన్ పోర్కీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీతా సుభాష్.. బావతో తెలుగు వారిని పలకరించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఎందుకో సెకండ్ లీడ్‌గానే ఆమెకు అవకాశాలు దక్కాయి. ఏకంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ అత్తారింటికి దారేదిలో ఛాన్స్ కొట్టేసినా అది కూడా సెకండ్ హీరోయిన్ కావడంతో బాగా డిజప్పాయింట్ అయ్యింది. అయినప్పటికీ పట్టు వదలకుండా అవకాశాల కోసం ట్రై చేసింది.

Actress pranita Subhash performs Ayudha Puja and her daughter Aksharabhyasa puja

మంచు ఫ్యామిలీ మొత్తం నటించిన పాండవులు పాండవులు తుమ్మెద, మహేశ్ బాబు బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాలు ప్రణీతకు మంచి పేరు తీసుకొచ్చాయి. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి హంగామా-2తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారామె. తనకు ఇంతటి పేరును తీసుకొచ్చిన సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశం ఆమెకు మొదటి నుంచి ఉంది. దీనిలో భాగంగా భారతదేశంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపు దాల్చినప్పుడు తన మంచి మనసును చాటుకున్నారు ప్రణీత. లాక్‌డౌన్ పీరియడ్‌లో బెంగళూరులో చిక్కుకుపోయిన వలస కూలీలు, పేదలకు తన వంతు సాయం చేసి రియల్ స్టార్ అనిపించుకున్నారు.

లాక్‌డౌన్ సమయంలోనే బెంగళూరుకు చెందిన ప్రముఖ బిజినెస్‌మెన్ నితిన్ రాజును ప్రణీత పెళ్లాడి సైలెంట్‌గా షాకిచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకే తాను తల్లిని కాబోతున్నట్లు అనౌన్స్ చేసిన ప్రణీత. గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఫోటోలు, వీడియోల రూపంలో మహిళలకు విలువైన సమాచారాన్ని అందజేశారు. ఈ క్రమంలోనే 2022 జూన్ 11న పండంటి ఆడబిడ్డకు ప్రణీత జన్మనిచ్చారు. ఇటీవల ప్రణీత రెండోసారి గర్భంగా దాల్చారు. సెప్టెంబర్ 5న బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ప్రణీతా సుభాష్.

డెలివరీ అయ్యిందో లేదో వెంటనే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ వస్తున్నారు ప్రణీత. తాజాగా దసరా పర్వదినం సందర్భంగా ప్రణీత తన ఫ్యామిలీతో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. తన కుమార్తె ఆర్నాకు అక్షరాభ్యసంతో చేయించిన ఆమె అ, ఆ లు దిద్దించారు. ఆ వెంటనే ఆయుధ పూజ చేసి తన కారుకు గుమ్మడికాయతో దిష్టి తీశారు. ట్రెడిషనల్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తు ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చిన్నారి బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

More from Filmibeat

Read more about: pranita subhash dussehra 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X