‘అత్తారింటికి దారేది’ తరువాత అలా జరిగింది.. ఆయనో అరుదైన నటుడు.. ప్రణీత కామెంట్స్
ఏ ముహూర్తాన బాపుగారి బొమ్మ అనే పాట ప్రణీత కోసం రాశారో గానీ అప్పటి నుంచి ఆ పేరే ఫిక్స్ అయింది. ఇంత వరకు అందంలోనే ప్రణీత మిన్న అనుకున్నారు. కానీ సాయం చేయడంలో పది మంది కోసం నిలబడటంతో అందంతో పాటు మంచి మనసుందని తెలుసుకున్నారు. ఎంతో మంది స్టార్ హీరోయిన్ల కన్నా.. ప్రతీణ వంద రెట్లు మేలని నెటిజన్లు కొనియాడుతున్నారు. కరోనా లాంటి విపత్కర కాలంలో ఎంతో మంది ఆకలిని తీరుస్తోంది.

ఒకే ఒక్క హీరోయిన్..
మొదటగా ఓ 50 కుటుంబాలకు సాయం చేసేందుకు గానూ లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించింది ప్రణీత. అందరూ కూడా సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఆపై తానే స్వయంగా దగ్గరుండి పేదలు, వలసకార్మికులందరికీ ఆకలిని తీర్చుతోంది. ప్రణీత సేవా కార్యక్రమాలను సోషల్ మీడియా మొత్తం హ్యాట్యాఫ్ చెప్పేస్తోంది.

బాలీవుడ్ ఎంట్రీ..
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. రెండు చిత్రాల్లో నటిస్తున్నానని పేర్కొంది. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని తెలిపింది. అజయ్ దేవగణ్ భుజ్, హంగామా 2 చిత్రంలో నటిస్తున్నానని వెల్లడించింది.
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు పబ్లిసిటీ చేసుకోవడం నచ్చదని తెలిపింది. తాను ఏ పని చేసినా సీక్రెట్‌గా ఉంచుతానని పేర్కొంది. డాక్టర్లైన మా తల్లిదండ్రుల కారణంగా సమాజ సేవపై ఆసక్తి ఏర్పడిందని చెప్పుకొచ్చింది. ఇప్పటికే రెండు స్కూళ్లను దత్తత తీసుకున్నానని తెలిపింది. కరోనా కోసం మరో 8 లక్షల ఫండ్‌ను కలెక్ట్ చేశానని పేర్కొంది.

అత్తారింటికి దారేది సమయంలో అలా..
అత్తారింటికి దారేది లాంటి పెద్ద హిట్ తరువాత తెలుగులో అంతగా నటించకపోవడానికి గల కారణాలను చెబుతూ.. ఆ సినిమా తరువాత కన్నడ, తమిళంలో బాగా అవకాశాలు వచ్చాయి.. తెలుగులో చెప్పుకోదగ్గ పాత్రలు రాకపోడంతో ఎక్కువగా చేయలేకపోయానని తెలిపింది.
Recommended Video

అరుదైన నటుడు..
పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ... ఆయనలోని సెన్సాఫ్ హ్యూమర్ ఎంతో ఇష్టమని తెలిపింది. ఎన్టీఆర్ గురించి చెబుతూ.. ఆయన డైలాగ్ చెప్పే విధానం ఇష్టమని చెప్పుకొచ్చింది. ఆయన డైలాగ్ లైన్స్ చెబుతూ ఉంటే షాక్ అయ్యేదాన్ని.. ఆయనో అరుదైన నటుడని కొనియాడింది.


Click it and Unblock the Notifications











