స్నానం చేస్తోన్న ఫొటోలతో షాకిచ్చిన హీరోయిన్: గర్భంతో ఉన్నా అస్సలు తగ్గట్లేదుగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ సందడి చేశారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ ప్రణిత సుభాష్ ఒకరు. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే క్రేజ్‌ను అందుకుంది. ఫలితంగా టాలీవుడ్‌లో చాలా కాలం పాటు హవాను చూపించింది. ఇక, గత ఏడాది వివాహం చేసుకున్న ప్రణిత.. త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సుందరాంగి బాత్‌టబ్‌ స్నానం చేస్తూ దిగిన ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

అలా పరిచయం.. తెలుగులోకి ఎంట్రీ

అలా పరిచయం.. తెలుగులోకి ఎంట్రీ

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే మోడల్‌గా సందడి చేసిన ప్రణిత సుభాష్.. ‘పోర్కి' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే ‘ఏం పిల్లో ఏం పిల్లడో' అనే సినిమాతో తెలుగులోకి కూడా పరిచయం అయింది. ఆరంభంలోనే క్యూట్ లుక్స్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు ఎంతగానో ఫేమస్ అయిపోయింది.

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో హవా

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో హవా

తెలుగులో తక్కువ సినిమాలకే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ప్రణిత.. ఫలితాలను మాత్రం ఆశించిన రీతిలో అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఆఫర్లను మాత్రం బాగానే దక్కించుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అందులో ‘అత్తారింటికి దారేది', ‘రభస', ‘బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాలూ ఉన్నాయి.

Recommended Video

Major Movie Review...Adivi Sesh కెరీర్ బెస్ట్ మూవీ #Tollywood | Filmibeat Telugu
తెలుగులోనే కాదు.. అక్కడ సందడిగా

తెలుగులోనే కాదు.. అక్కడ సందడిగా

ప్రణిత సుభాస్ కన్నడ అమ్మాయి కావడంతో మాతృ భాషలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులోనే చాలా సినిమాల్లో తళుక్కుమంది. అలాగే, తమిళంలోనూ ఈ చిన్నది కొన్ని మూవీలలో నటించింది. ఇక, హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ప్రణిత.. ‘హంగామా 2', ‘భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే సినిమాల్లో నటించింది. ఇలా అన్ని భాషల్లోనూ హవా చూపింది.

అతడితో పెళ్లి.. తల్లి కాబోతున్న భామ

అతడితో పెళ్లి.. తల్లి కాబోతున్న భామ

వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్న ప్రణిత సుభాష్.. 2021లో నితిన్ రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులతో పాటు సినీ ప్రియులు షాక్‌కు గురయ్యారు. ఇక, ఇప్పుడు ఈ కన్నడ భామ ప్రెగ్నెంట్‌గా ఉంది. త్వరలోనే ఓ బిడ్డకు జన్మను ఇవ్వబోతుంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా

అక్కడ మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా

సినిమాల పరంగా బిజీగా ఉన్నా లేకున్నా ప్రణిత సుభాష్ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ హైలైట్ అవుతోంది.

ఎక్కువగా అందాలను ఆరబోస్తూనే

ఎక్కువగా అందాలను ఆరబోస్తూనే

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ప్రణిత సుభాష్.. ఎక్కువగా అందాలను ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. ఇక, ఇప్పుడు గర్భవతిగా ఉన్న ఈ భామ.. బేబీ బంప్ ఫొటోలను కూడా వదులుతోంది. ఫలితంగా నిత్యం హాట్ టాపిక్ అవడంతో పాటు తన గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌నే షేక్ చేసి పడేస్తోంది.

స్నానం చేస్తోన్న ఫొటోలతో హల్‌చల్

స్నానం చేస్తోన్న ఫొటోలతో హల్‌చల్

తాజాగా ప్రణిత సుభాష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో బాత్‌టబ్‌లో స్నానం చేస్తూ కనిపించింది. అదే సమయంలో తన గర్భాన్ని కూడా చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్ అయ్యాయి. అలాగే, ఈ బ్యూటీతపై విమర్శలు కూడా చెలరేగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X