ప్రణిత సుభాష్ సీమంతం ఫోటోలు వైరల్.. బికినీలో బేబీ బంప్‌తో ఫోటోషూట్

కన్నడ సినీ పరిశ్రమలో కెరీర్ ఆరంభించిన ప్రణిత సుభాష్ అతికొద్ది రోజుల్లోనే బాలీవుడ్ స్థాయికి ఎదిగింది. కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉండగానే అభిమానులకు షాకిచ్చి పెళ్లి చేసుకొని దాంపత్య జీవితంలో సెటిల్ అయిపోయింది. అంతేకాకుండా ఇటీవల తాను తల్లి కాబోతున్నానని అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభవార్తను అందించింది. తాజాగా జరిగిన శ్రీమంతం ఫోటోలు సీమంతం సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ప్రణిత సుభాష్ సీమంతం వేడుకకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

లాక్‌డౌన్‌లో నిరాడంబరంగా పెళ్లి

లాక్‌డౌన్‌లో నిరాడంబరంగా పెళ్లి

గతేడాది లాక్‌డౌన్ సమయంలో ప్రణీత సుభాష్ సమాజ సేవలో నిమగ్నమైంది. ఆటోడ్రైవర్లకు సానిటైజర్, పేదలకు అన్నదానం లాంటి కార్యక్రమాలను తన తండ్రితో కలిసి చేశారు. అయితే ఇలా సమాజ సేవలో ఉంటూనే వైవాహిక జీవితానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2021లో నితిన్ రాజు అనే వ్యాపారవేత్తతో వివాహం జరిగింది.

కొద్ది నెలలకే ప్రెగ్నెన్సీ అంటూ శుభవార్త

కొద్ది నెలలకే ప్రెగ్నెన్సీ అంటూ శుభవార్త

పెళ్లి అయిన కొద్ది నెలలకే తల్లిని కాబోతున్నానంటూ ప్రణీత తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఆ తర్వాత తన ప్రెగ్నెన్సీ గురించి ఫోటోల ద్వారా సమాచారం అందించింది. తన గర్బాన్ని అద్దంలో చూసుకొంటూ ఫోటోలను షేర్ చేసింది. ఎవరైనా గర్బం దాల్చితే తన కడుపును ప్రతీసారి అద్దంలో చూసుకొని మురిసిపోతారు అని ఓ సందర్భంలో ఫోటోలతో తన మనసులోని భావాలను పంచుకొన్నది.

బికినీలో ఫోటోషూట్‌తో

బికినీలో ఫోటోషూట్‌తో

ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతీ విషయాన్ని తన అభిమానులు, నెటిజన్లతో ప్రణీత సుభాష్ పంచుకొన్నది. బికినీలో తన గర్బాన్ని చూసుకొంటూ మాతృత్వపు అనుభూతులను ఆస్వాదించింది. తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని తన ఇన్స్‌టాగ్రామ్‌లో అప్‌డేట్ ఇచ్చింది.

ప్రణీత సుభాష్‌కు సీమంతం

ప్రణీత సుభాష్‌కు సీమంతం

త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దంగా ఉన్న ప్రణిత సుభాష్‌కు కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులు సీమంతం జరిపించారు. బంతిపూలతో అందంగా ముస్తాబు చేసిన వేదికపై పసుపు, గులాబి రంగు అంచు ఉన్న చీరలో ప్రణీత అందంగా కనిపించారు. సంప్రదాయంగా కుటుంబ సభ్యులు ఈ వేడుకను ఆడంబరంగా జరిపించారు.

గంటల్లోనే లక్షల లైక్స్

గంటల్లోనే లక్షల లైక్స్

తన సీమంతానికి సంబంధించిన ఫోటోలను ప్రణిత సుభాష్ షేర్ చేయగా వైరల్ అయ్యాయి. 5 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్న అకౌంట్‌లో ప్రణీతకు శుభాకాంక్షలు తెలియజేస్తు ఫ్యాన్స్ తన అభిమానాన్ని చాటుకొన్నారు. ప్రణీత సీమంత ఫోటోలకు 145870 లక్షల లైక్స్ వచ్చాయి. ప్రణీత నువు చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.

ప్రణీత సుభాష్ కెరీర్ ఇలా..

ప్రణీత సుభాష్ కెరీర్ ఇలా..

ప్రణీత సుభాష్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. కన్నడంలో రీమేక్ పోకిరి చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించింది. ఆ త్వత తెలుగులోకి ప్రవేశించారు. బావ, అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించారు. హిందీలో ప్రవేశించి అజయ్ దేవగన్‌తో కలిసి భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఛాన్ కిత్తన్ సినిమాలో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X