For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డెలివరీ తర్వాత తొలిసారి బికినీలో ప్రణిత: మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

  |

  సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది నటీమణులు శృతి మించిన హాట్ షో చేస్తున్నారు. తద్వారా తమ ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ ప్రణిత సుభాష్ ఒకరు. అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన ఈ చిన్నది.. పెళ్లి తర్వాత మాత్రం స్పీడును అమాంతం తగ్గించేసింది.

  కానీ, సోషల్ మీడియా ద్వారా మాత్రం విపరీతంగా సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఈ భామ అదిరిపోయే ఫొటోలతో అవాక్కయ్యేలా చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రణిత కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

  అలా పరిచయం.. ఫుల్ పాపులర్

  అలా పరిచయం.. ఫుల్ పాపులర్

  ప్రణిత సుభాష్ నటన మీద ఉన్న మక్కువతో టీనేజ్‌లోనే 'పోర్కి' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ మూవీతో దక్షిణాది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో ఆమెకు అన్ని భాషల్లోనూ ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రణిత 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తనదైన పాత్రతో ఫుల్ పాపులర్ అయింది.

  బిందు మాధవి ఎద అందాల అరాచకం: పైన ఏమీ లేకపోవడంతో!

  తెలుగు స్టార్లతో... ఫలితం లేదు

  తెలుగు స్టార్లతో... ఫలితం లేదు

  మిగిలిన భాషల సంగతి పక్కన పెడితే తెలుగులో ప్రణిత సుభాష్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. మరీ ముఖ్యంగా ఈ చిన్నది బడా హీరోలతోనే ఎక్కువగా స్క్రీన్ షేర్ చేసుకుంది. అలా 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాల్లో భాగం అయింది. అయితే, ప్రణిత నటించిన ఈ సినిమాల్లో చాలా తక్కువ మాత్రమే విజయవంతం అయిన విషయం తెలిసిందే.

  బాలీవుడ్‌లోనూ ఫుల్‌గా సందడి

  బాలీవుడ్‌లోనూ ఫుల్‌గా సందడి

  కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయి కావడంతో ప్రణిత సుభాష్ మాతృభాషలోనే ఎక్కువ చిత్రాల్లో నటించింది. అలాగే, తమిళంలోనూ కొన్ని మూవీలలో కనిపించింది. ఇక, బాలీవుడ్‌లోకి సైతం ఎంటరైన ఈ బ్యూటీ.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే చిత్రాల్లో నటించింది. ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసి దేశ వ్యాప్తంగా స్టార్‌డమ్‌ను అందుకుంది.

  శృతి మించిన నందినీ హాట్ షో: టాప్ అందాలను ఆరబోస్తూ రచ్చ

  పెళ్లితో కెరీర్‌కు గ్యాప్ ఇచ్చింది

  పెళ్లితో కెరీర్‌కు గ్యాప్ ఇచ్చింది

  సుదీర్ఘ కాలంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటిన ప్రణిత సుభాష్.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అందరికీ షాకిచ్చింది. అలాగే, ఆమె తన భర్త ఫొటోలను కూడా షేర్ చేసింది. అప్పటి నుంచి ఈ అమ్మడు సినిమాలకు దూరంగానే ఉంటోంది.

  తల్లైన ప్రణిత.. కెరీర్‌పైన ఫోకస్

  తల్లైన ప్రణిత.. కెరీర్‌పైన ఫోకస్

  పెళ్లి తర్వాత కొన్ని నెలలకే గర్భవతి అయిన ప్రణిత సుభాష్.. ఈ మధ్యనే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన ఆ భామ.. తన చిన్నారి ఫొటోలను కూడా అందులో వదిలింది. అంతేకాదు, నిత్యం తన కూతురితోనే గడుపుతూ మాతృత్వాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తోంది. ఇక, ఇప్పుడు ఈ చిన్నది కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  Bigg Boss Telugu 6: షోలో గీతూ ఊహించని పని.. అందరి ముందే బట్టలు విప్పేసి మరీ!

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

  అప్పట్లో వరుసగా సినిమాలు చేసినా.. కొంత కాలంగా వెండితెరపై కనిపించుకుండా ఉన్నా.. హీరోయిన్ ప్రణిత సుభాష్ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ హైలైట్ అవుతోంది.

  బికినీలో కనిపించి షాకిచ్చింది

  బికినీలో కనిపించి షాకిచ్చింది

  ప్రణిత సుభాష్ గతంలో తన అందచందాలను ఆరబోస్తూ హాట్ ఫొటోలను షేర్ చేసేది. దాన్నే ఇప్పుడూ కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు బీచ్‌లో బికినీతో కనిపించింది. తద్వారా తన అందచందాలతో కుర్రాకారును రెచ్చగొడుతోంది. ఫలితంగా ప్రణిత షేర్ చేసిన ఈ ఫొటోకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవన్నీ తెగ వైరల్ అయిపోయాయి.

  English summary
  Famous Actress Pranitha Subhash is Very Busy In Social Media. Now She Shared her Latest Hot Bikini Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X