డెలివరీ తర్వాత ప్రణిత హాట్ షో: హద్దు దాటేసి మరీ అందాలను చూపిస్తూ!
ప్రణిత సుభాష్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ క్యూట్ హీరోయిన్ తనదైన అందం, అభినయంతో రాణిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. అంతేకాదు, దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నేషనల్ రేంజ్‌లో సందడి చేసింది. ఫలితంగా క్రేజ్‌ను కూడా భారీగా పెంచుకుంది. ఇక, పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితేనేం సోషల్ మీడియా ద్వారా తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రణిత కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

అప్పుడే ప్రణిత ఫుల్ పాపులర్
ప్రణిత సుభాష్ 'పోర్కి' అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ మూవీతో దక్షిణాది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో ఆమెకు అన్ని భాషల్లోనూ ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రణిత 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇలా కెరీర్ ఆరంభంలోనే ప్రణిత దక్షిణాదిలో వరుస ఆఫర్లతో ఫుల్ పాపులర్ అయిపోయింది.

టాలీవుడ్ స్టార్... సక్సెస్ లేదు
కన్నడంలో ఎన్నో సినిమాల్లో నటించిన ప్రణిత సుభాష్.. ఆ తర్వాత తెలుగులో ఎక్కువ ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే ఈ భామ టాలీవుడ్‌లోని చాలా మంది హీరోలతో కలిసి నటించింది. అందులో బడా స్టార్లతో కలిసి 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాలు చేసింది. అయితే, హీరోయిన్‌గా ప్రణితకు తెలుగులో సక్సెస్ రేటు తక్కువే ఉంది.

బాలీవుడ్‌లోనూ సందడి చేసి
సుదీర్ఘమైన ప్రయాణంలో ప్రణిత సుభాష్ హీరోయిన్‌గా దక్షిణాదిలోని చాలా భాషల్లో సినిమాలు చేసింది. ఇక, బాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించిన ఈ భామ.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే చిత్రాలను చేసింది. ఇలా దక్షిణాదితో పాటు హిందీలోనూ సినిమాలు చేసి దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది.

మ్యారేజ్ తర్వాత కెరీర్ గ్యాప్
వరుస సినిమాలతో సత్తా చాటుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ప్రణిత సుభాష్.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. అలాగే, ఆమె తన భర్త ఫొటోలను కూడా షేర్ చేసింది. అప్పటి నుంచి హీరోయిన్ ప్రణిత సినిమాలకు దూరంగా ఉంటోంది.

తల్లైన ప్రణిత... ఫోకస్ చేస్తూ
ఆ మధ్య వివాహం చేసుకున్న ప్రణిత సుభాష్.. కొంత కాలానికే ప్రెగ్నెంట్ అయింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన ఆ భామ.. తన చిన్నారి ఫొటోలను కూడా అందులో వదిలింది. ఇక, ఇటీవలి కాలంలో ఆమె ముఖానికి మేకప్ వేసుకుని కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. దీంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేస్తుంది.

సోషల్ మీడియాలో హడావిడి
సౌత్ నుంచి నార్త్ వరకూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్‌పై పెద్ద కనిపించుకున్నా.. హీరోయిన్ ప్రణిత సుభాష్ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేస్తోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

ప్రణిత హాట్ ఫొటోలు వైరల్‌గా
ప్రణిత సుభాష్ చాలా కాలం వరకూ తన అందచందాలను ఆరబోస్తూ తీసుకున్న హాట్ ఫొటోలను షేర్ చేసేది. ఇప్పుడు తల్లైన తర్వాత కూడా అదే కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను వదిలింది. ఫలితంగా ప్రణిత ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కి వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











