గ్రాండ్‌గా బేబీ షవర్ సెలబ్రేషన్స్ .. వైట్ డ్రెస్‌లో బేబీ బంప్‌తో పవన్ హీరోయిన్

అందం , అభినయం ఉన్నా కొందరు హీరోయిన్లకు ఎందుకో కాలం కలిసి రాలేదు. అందుకే ఎంత స్పీడ్‌గా తెరపైకి ఎంట్రీ ఇస్తారో, అంతే వేగంగా ఫేడవుట్ అయిపోతుంటారు. ఈ కోవలోకే వస్తారు ప్రణీతా సుభాష్. చూడచక్కని అందంతో, కలువల్లాంటి కల్లు, వైట్ స్కీన్‌టోన్‌తో పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్న ఈ కన్నడ కస్తూరికి ఎందరో స్టార్ డమ్ దక్కలేదు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు బ్లాక్‌బస్టర్ మూవీ పోకిరికి కన్నడ వెర్షన్ పోర్కీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీతా సుభాష్.. బావతో తెలుగు వారిని పలకరించింది.

కానీ ఎందుకో తెలుగులో సెకండ్ లీడ్‌గానే ఆమెకు అవకాశాలు దక్కాయి. అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాలు ప్రణీతకు మంచి పేరు తీసుకొచ్చాయి. హిందీలో హంగామా-2తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారామె. కరోనా సమయంలో వలస కూలీలు, పేదలకు తన వంతు సాయం చేసి రియల్ స్టార్ అనిపించుకున్నారు. స్వయంగా ఆహారం తయారు చేసి వాటిని అన్నార్తులకు అందజేశారు.

actress Pranitha Subhash got second time pregnancy baby bump photos goes viral here s the details

లాక్‌డౌన్ సమయంలోనే అనూహ్యంగా తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి బాంబు పేల్చారు ప్రణీత. బెంగళూరుకు చెందిన ప్రముఖ బిజినెస్‌మెన్ నితిన్ రాజును ఆమె పెళ్లాడారు. కోవిడ్ కారణంగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో 2021 జూన్ 1న వీరి పెళ్లి జరిగింది. కొద్దిరోజులకే తాను తల్లిని కాబోతున్నట్లు అనౌన్స్ చేసిన ప్రణీత ఆ సమయంలో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహారం, వ్యాయామాలు వంటి వాటి గురించి సూచనలు చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసేది.

ఈ క్రమంలోనే 2022 జూన్ 11న పండంటి ఆడబిడ్డకు ప్రణీత జన్మనిచ్చారు.సహజంగా రాజకీయాలకు దూరంగా ఉండే ప్రణీత .. మొన్నామధ్య కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా దక్షిణాది వారిపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. భారత్‌లో తూర్పు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ రాష్ట్రాల్లోని వారు అరబ్బుల్లా, ఉత్తరాది వారు శ్వేతజాతీయుల్లా, దక్షిణాది వారు ఆఫ్రికన్లలా ఉంటారని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టిన పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ తన ఫోటోను జత చేసింది ప్రణీత. తాను దక్షిణ భారతీయురాలినని.. మరి ఈ ఫోటోలో తాను భారతీయురాలిగా కనిపిస్తున్నానా అని ప్రశ్నించింది.

ఇదిలాఉండగా. .ఇటీవల ప్రణీత రెండోసారి గర్భంగా దాల్చారు. రౌండ్ 2 అని ఇప్పుడు నా ప్యాంట్స్ సరిపోవడం లేదంటూ ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని పంచుకున్నారు. రెండ్రోజుల క్రితం బెంగళూరులోని బస్టైన్ గార్డెన్ సిటీలో ప్రణీత బేబీ షవర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో తన కూతురిని ఎత్తుకుని భర్తతో కలిసి కేక్ కట్ చేసి, తన ఆనందాన్ని పంచుకుంది. వైట్ కలర్ డ్రెస్‌లో తన బేబీ బంప్‌ను చూపిస్తూ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: pranitha subhash movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X