ఇద్దరు బిడ్డల తల్లయినా తరగని అందం .. పచ్చల హారంతో ప్రణీత ధగధగలు

అందం, అభినయం దండిగా ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లు సక్సెస్ కాలేకపోతున్నారు. ఈ కోవలోకే వస్తారు కన్నడ కస్తూరి ప్రణీత సుభాష్. కలువల్లాంటి కల్లు, వైట్ స్కీన్‌టోన్‌తో పర్ఫెక్ట్ ఫిగర్ అనిపించుకుంది ఈ బెంగళూరు భామ. కానీ అవకాశాలు మాత్రం నిల్. కెరీర్ కోసం శ్రమిస్తూనే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రణీత. తాజాగా పండుగ పూట ప్రణీత పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు బ్లాక్‌బస్టర్ మూవీ పోకిరికి కన్నడ వెర్షన్ పోర్కీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు ప్రణీతా సుభాష్. అక్కడ దక్కిన పాపులారిటీతో సిద్ధార్ధ్ హీరోగా వచ్చిన బావతో తెలుగు వారిని పలకరించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఎందుకో ప్రణీతకు సెకండ్ లీడ్‌గానే ఆమెకు అవకాశాలు దక్కాయి. ఈ దశలో ఏకంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన‌ అత్తారింటికి దారేదిలో ఛాన్స్ కొట్టేసినా అది కూడా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కావడంతో బాగా డిజప్పాయింట్ అయ్యింది.

Actress Pranitha Subhash latest Photoshoot for diwali her latest Photos here

తర్వాత మంచు ఫ్యామిలీ మొత్తం నటించిన పాండవులు పాండవులు తుమ్మెద, మహేశ్ బాబు బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాలు ప్రణీతకు మంచి పేరు తీసుకొచ్చాయి. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి హంగామా-2లో నటించారు. కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న దశలో ఇక పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని భావించిన ప్రతీణ.. తల్లిదండ్రులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

కరోనా లాక్‌డౌన్ సమయంలోనే బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రణీత పెళ్లాడి సైలెంట్‌గా షాకిచ్చారు. సోషల్ మీడియాలో ఫోటోలు బయటికి వస్తే కానీ ప్రణీత పెళ్లి గురించి తెలియలేదంటే ఆమె ఎంత గుట్టుగా వ్యవహరించారో అర్ధం చేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిరోజులకే తాను తల్లిని కాబోతున్నట్లు అనౌన్స్ చేసిన ప్రణీత. గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఫోటోలు, వీడియోల రూపంలో తెలియజేశారు. 2022 జూన్ 11న పండంటి ఆడబిడ్డకు ప్రణీత జన్మనిచ్చారు.

బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ ఇంటికే పరిమితమైన ప్రణీత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ట్రై చేస్తోంది. ఈ దశలో ప్రణీత రెండోసారి గర్భంగా దాల్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ప్రణీతా సుభాష్. డెలివరీ అయ్యిందో లేదో వెంటనే ఫోటో షూట్‌లలో దిగారు ఈ కన్నడ కస్తూరి. హాట్ హాట్ ఫోటోలతో కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని రీతిలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు.

తాజాగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రణీత సుభాష్. లేటెస్ట్ మోడల్ లంగా వోణీలో దర్శనమిచ్చారు. దీనికి మ్యాచింగ్‌గా మెడలో ధరించిన పచ్చల హారం అదిరిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. ప్రణీత మెరుపుల ముందు ఆ నెక్లెస్ కూడా వెలవెల బోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: pranitha subhash diwali 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X