Pranitha Subhash: తల్లైన తరువాత కూడా బికినీలో షాక్ ఇచ్చిన హోమ్లీ హీరోయిన్.. స్టన్నింగ్ లుక్!

సాధారణంగా పెళ్లి తర్వాత కొంతమంది హీరోయిన్స్ సినిమాలకు దూరంగా ఉంటూ.. అలాగే గ్లామర్ ప్రపంచానికి కూడా దూరమవుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఒక వైపు ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు సినిమాలతో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా గ్లామర్ అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్నారు. రీసెంట్ గా ప్రణీత సుభాష్ కూడా మరోసారి బికినీ అందాలతో షాక్ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 మొదట్లోనే బిగ్ హిట్

మొదట్లోనే బిగ్ హిట్

బ్యూటిఫుల్ హీరోయిన్ గా సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ప్రణీత సుభాష్ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. మొదట కన్నడ చిత్ర పరిశ్రమలో పోకిరి రీమేక్ లో నటించిన అమ్మడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులో కూడా ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వచ్చాయి.

సైడ్ హీరోయిన్

సైడ్ హీరోయిన్

2010 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ప్రణిత సుభాష్ టాలీవుడ్ లో మొదట సిద్ధార్థ్ తో బావ అనే సినిమా చేసింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్ళీ తెలుగులో ఆఫర్లు దక్కలేదు. ఎక్కువగా కన్నడ తమిళ సినిమాలోని నటించింది. ఇక ఆ తరువాత అత్తారింటికి దారేది సినిమాలో ఒక సైడ్ హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ అందుకుంది.

 ఆశలు పెట్టుకున్న సినిమా డిజాస్టర్

ఆశలు పెట్టుకున్న సినిమా డిజాస్టర్

ఆ తర్వాత ప్రణిత సుభాష్ మళ్లీ మెయిన్ హీరోయిన్ గా అయితే పెద్ద హీరోలతో కనిపించలేకపోయింది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రహ్మోత్సవం సినిమా కూడా ఊహించిన విధంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక తర్వాత పెద్దగా ఆశలు పెట్టుకోకుండా ఆమె చిన్న సినిమాల్లో కనిపించింది. తెలుగులో మెయిన్ హీరోయిన్ గా ఆఫర్స్ రాకపోయినప్పటికీ కూడా కన్నడలో మాత్రం మీడియం రేంజ్ హీరోలతో అవకాశాలు బాగానే వచ్చాయి.

 హడావుడి లేకుండా పెళ్లి

హడావుడి లేకుండా పెళ్లి

ప్రస్తుతం కూడా కొన్ని సినిమాలు చేస్తున్న ప్రణిత సుభాష్ పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తుంది అనే ఒక రూమర్ కు చెక్ పెట్టేసిందే. 2021లో ప్రణిత సుభాష్ ఎలాంటి హడావిడి లేకుండా నితిన్ రాజు అనే ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ప్రణీత పెళ్లి చేసుకునే వరకు కూడా ఆ విషయాన్ని మీడియాలో కూడా లీక్ చేయలేదు. ఇక ఏడదిలోనే ఆమె పండండి ఆడపిల్లకు కూడా జన్మనిచ్చింది.

బికినీ లుక్ వైరల్

ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ తో చాలా హ్యాపీగా ఉన్నా ప్రణీత సుభాష్ సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంటోంది. ఇక రీసెంట్ గానే ఎవరు ఊహించని విధంగా బికినీ వీడియోను కూడా షేర్ చేసుకోవడం విశేషం.

బీచ్ లో అలా నడుచుకుంటూ వస్తున్న ప్రనిత సుభాష్ అందమైన బికినీ లుక్ లో ఒక విధంగా ఫాలోవర్స్ కు షాక్ ఇచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా కనిపించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మరి ఈ గ్లామరస్ అందాలతో అమ్మడు మళ్ళీ ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X