హీరోయిన్ ప్రణిత అందాల ఆరబోత: డెలివరీ తర్వాత హాట్ షోతో అరాచకం

సినీ పరిశ్రమలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటారు. అందులోనూ కొందరు అవకాశాలను దక్కించుకోవడంలో విఫలం అవుతున్నారు. ఆ కోవలోకే వస్తుంది కన్నడ భామ ప్రణిత సుభాష్.

అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉన్నా.. ఈ అమ్మడు సరైన అవకాశాలను సొంతం చేసుకోలేకపోయింది. ఫలితంగా టాలీవుడ్‌కు దూరం అయిపోయింది. ఈ క్రమంలోనే ప్రణిత ఇటీవలే ఓ బిడ్డకు తల్లైన విషయం తెలిసిందే. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి!

అలా ఎంటర్.. ఇలా పాపులర్

అలా ఎంటర్.. ఇలా పాపులర్

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ప్రణిత సుభాష్ మోడలింగ్ రంగంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే 'పోర్కి' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ వెంటనే 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే సినిమాతో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. ఆరంభంలోనే క్యూట్ లుక్స్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు పాపులర్ అయింది.

స్టార్లతోనే నటించిన అమ్మడు

స్టార్లతోనే నటించిన అమ్మడు


చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో పాపులర్ అయిన ప్రణిత.. వరుసగా ఆఫర్లను మాత్రం దక్కించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులోని అందరు స్టార్ హీరోలతోనూ ఆడిపాడింది. ఇందులో 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాలు ప్రణితకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. అయితే, ఎక్కువ శాతం విజయాలను మాత్రం అందించలేదు.

వాటిలో మాత్రం హవా చూపి

వాటిలో మాత్రం హవా చూపి


ప్రణిత సుభాష్ కర్నాటకకు చెందిన అమ్మాయి కావడంతో కన్నడంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. అలాగే, తమిళంలోనూ ఈ చిన్నది కొన్ని మూవీలలో నటించింది. ఇక, హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే సినిమాలు చేసింది. ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. తద్వారా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది.

 పెళ్లి చేసుకుని.. గ్యాప్ ఇచ్చి

పెళ్లి చేసుకుని.. గ్యాప్ ఇచ్చి

వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ప్రణిత సుభాష్.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అలాగే, ఆమె తన భర్త ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇక, వివాహం తర్వాత మాత్రం ప్రణిత సినిమాలకు దూరంగా ఉంటోంది.

తల్లైన ప్రణిత.. కూతురితోనే

తల్లైన ప్రణిత.. కూతురితోనే

పెళ్లైన కొంత కాలానికే ప్రెగ్నెంట్ అయిన ప్రణిత సుభాష్.. కొద్ది రోజుల క్రితమే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన ఆ భామ.. తన చిన్నారి ఫొటోలను కూడా షేర్ చేసింది. అంతేకాదు, నిత్యం తన కూతురితోనే గడుపుతూ మాతృత్వాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

 సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

అప్పట్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కెరీర్‌కు బ్రేక్ ఇచ్చినా.. ప్రణిత సుభాష్ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ తెగ హైలైట్ అవుతూనే ఉంటోంది.

తొలిసారి షార్ట్ డ్రెస్‌తో రచ్చ

తొలిసారి షార్ట్ డ్రెస్‌తో రచ్చ

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రణిత సుభాష్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె మరింత షార్ట్ డ్రెస్‌తో కనిపించింది. అంతేకాదు, బ్లేజర్ తీసేసి మరీ అందాలను ఆరబోసింది. దీంతో ప్రణిత షేర్ చేసిన ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ తక్కవు టైంలోనే వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X