For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డెలివరీ తర్వాత ఊహించని లుక్‌లో ప్రణీత: ఆమెనిలా చూశారంటే షాకే!

  |

  చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన నటన.. ఆకట్టుకునే హావభావాలు.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించింది ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్. పేరుకు కన్నడ అమ్మాయే అయినా తెలుగులో బాగా ఫేమస్ అయిన ఈ భామ.. వరుస సినిమాలతో సందడి చేసింది. అదే సమయంలో టాలీవుడ్‌లోని స్టార్లతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

  ఇలా ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్న సమయంలోనే గత ఏడాది పెళ్లి చేసుకుంది. ఇక, ఇటీవలే ప్రణీత తల్లి కూడా అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిలో ప్రణీత లుక్స్‌ను మీరు కూడా చూసేయండి మరి!

  అలా వచ్చింది.. ఇలా ఫేమస్

  అలా వచ్చింది.. ఇలా ఫేమస్

  హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే మోడల్‌గా హవాను చూపించిన ప్రణీత సుభాష్.. 'పోర్కి' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే సినిమాతో తెలుగులోకి కూడా పరిచయం అయింది. ఆరంభంలోనే క్యూట్ లుక్స్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు ఎంతగానో ఫుల్ ఫేమస్ అయింది.

  స్విమ్మింగ్ పూల్‌లో నందినీ రాయ్ అందాల ఆరబోత: వామ్మో మరీ ఇంత హాట్‌గానా!

  బడా హీరోలతో కలిసి సందడి

  బడా హీరోలతో కలిసి సందడి

  టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయిన ప్రణీత.. సరైన విజయాలను మాత్రం అందుకోలేపోయింది. కానీ, వరుసగా ఆఫర్లను మాత్రం దక్కించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులోని అందరు స్టార్ హీరోలతోనూ ఆడిపాడింది. ఇందులో 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాలు ప్రణీతకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి.

  ఆ భాషల్లోనూ హవా చూపించి

  ఆ భాషల్లోనూ హవా చూపించి

  ప్రణీత సుభాష్ కన్నడ అమ్మాయి కావడంతో మాతృ భాషలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులోనే చాలా సినిమాల్లో తళుక్కుమంది. అలాగే, తమిళంలోనూ ఈ చిన్నది కొన్ని మూవీలలో నటించింది. ఇక, హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే సినిమాలు చేసింది. ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది.

  ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!

  అతడితో పెళ్లి... కెరీర్‌కు బ్రేక్

  అతడితో పెళ్లి... కెరీర్‌కు బ్రేక్

  దేశ వ్యాప్తంగా ఉన్న చాలా భాషల్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్న ప్రణీత సుభాష్.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అలాగే, ఆమె తన భర్త ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ప్రణీత అభిమానులతో పాటు సినీ ప్రియులు షాకయ్యారు.

  తల్లైన బ్యూటీ.. ఆసక్తికరంగా

  తల్లైన బ్యూటీ.. ఆసక్తికరంగా

  వివాహం అయిన కొంత కాలానికే ప్రెగ్నెంట్ అయిన ప్రణీత సుభాష్.. కొద్ది రోజుల క్రితమే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ 'పాప పుట్టినప్పట్నుంచి అంతా కలలా అనిపిస్తోంది. నాకు గైనకాలజిస్ట్ అయిన తల్లి ఉండటం నిజంగా నా అదృష్టం' అని పేర్కొంది. ఆ తర్వాత తన చిన్నారి ఫొటోలను కూడా షేర్ చేసింది.

  శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ ట్రీట్: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో అలా అందాల కనువిందు!

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

  కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా లేకున్నా ప్రణీత సుభాష్ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

  డెలివరీ తర్వాత కూడా ఇలా

  డెలివరీ తర్వాత కూడా ఇలా

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రణీత సుభాష్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె మరింత క్యూట్‌గా కనిపిస్తోంది. దీంతో డెలివరీ తర్వాత కూడా ఏమాత్రం శరీరాకృతిలో మార్పు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని చాలా మంది కామెంట్లు చేస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఫలితంగా ఈ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

  English summary
  Famous Actress Pranitha Subhash is Very Busy In Social Media. Now She Shared her Latest Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X