బ్రహ్మముడిలో కళావతిలా మారిన ప్రణీత సుభాష్ .. ఇంత టాలెంట్ పెట్టుకుని!
సినిమాల్లో నటీనటులుగా ఉన్న వారు నిజానికి మోస్ట్ టాలెంటెడ్. నటన ఒక్కటే కాదు, మిగిలిన చాలా విషయాల్లోనూ పట్టున్న వారెందరో. వీరిలో సింగర్స్, డ్యాన్సర్స్, రైటర్స్, పెయింటర్స్ ఇలా ఎందరో ఉన్నారు. కానీ తమ కళను బయటికి మాత్రం చూపించరు. ఏదోలా వీరి టాలెంట్ బయటికొచ్చినప్పుడు మాత్రం అంతా ముక్కున వేలేసుకుంటారు. ఇప్పుడు ఈ కేటగిరీలోకే వస్తారు ప్రణీత సుభాష్.
కలువల్లాంటి కల్లు, పాల మీగడ లాంటి అందంతో పర్ఫెక్ట్ ఫిగర్ అనిపించుకున్నారు ప్రణీత. కానీ కట్ చేస్తే అవకాశాలు మాత్రం నిల్. సూపర్‌స్టార్ మహేశ్ బాబు బ్లాక్‌బస్టర్ మూవీ పోకిరికి కన్నడ రీమేక్ పోర్కీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు ప్రణీతా సుభాష్. శాండిల్‌వుడ్‌లో దక్కిన పాపులారిటీతో సిద్ధార్ధ్ హీరోగా వచ్చిన బావతో తెలుగు వారిని పలకరించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఎందుకో గానీ ఆమెకు సెకండ్ లీడ్‌గానే అవకాశాలు దక్కాయి.

ఇలాంటి సమయంలో ఏకంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీతో తన రేంజ్ మారిపోతుందని ప్రణీత అనుకున్నారు. ఇందులో బాపు గారి బొమ్మ అంటూ పవన్‌తో కలిసి డ్యూయెట్ కూడా పడింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అయినా ప్రణీతకు ఏమాత్రం లక్ కలిసి రాలేదు. తర్వాత మంచు ఫ్యామిలీ మొత్తం నటించిన పాండవులు పాండవులు తుమ్మెద, మహేశ్ బాబు బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాలు ప్రణీతకు మంచి పేరు తీసుకొచ్చాయి.
తెలుగు, తమిళంలలో కొన్ని సినిమాలలో నటించిన ప్రణీత అనంతరం బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి హంగామా-2తో అదృష్టం పరీక్షించుకున్నారు . కెరీర్ ఏదోలా నెట్టుకొస్తున్న దశలో ఇక పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని భావించిన ప్రణీత .. తల్లిదండ్రులకు నచ్చిన అబ్బాయినే పెళ్లాడారు. కరోనా లాక్‌డౌన్ సమయంలోనే బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రణీత పెళ్లాడి సైలెంట్‌గా ఇండస్ట్రీకి, అభిమానులకు షాకిచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకే తాను తల్లిని కాబోతున్నట్లు అనౌన్స్ చేసిన ప్రణీత . మహిళలు గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనే సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.
2022 జూన్ 11న పండంటి ఆడబిడ్డకు ప్రణీత జన్మనిచ్చిన ఆమె , ఇటీవల మరోసారి గర్భం దాల్చి ఈ ఏడాది సెప్టెంబర్ 5న బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డను ప్రసవించారు. డెలివరీ అయ్యిందో లేదో వెంటనే ఫోటో షూట్‌లలో దిగారు ఈ కన్నడ కస్తూరి. ఇద్దరు బిడ్డల తల్లయినా హాట్ హాట్ ఫోటోలతో కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని రీతిలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు. తాజాగా తనలోని మరో టాలెంట్‌ను ప్రణీత బయటపెట్టారు. శంఖు, చక్ర నామాలున్న ఓ చక్కకు ఆమె రంగులు వేస్తూ ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పూజకు ముందు మా అత్తగారు నాకు చిన్న టాస్క్‌లు ఇచ్చారని.. ఈ ఆర్ట్ థెరపీ నాకెంతో రిలీఫ్ ఇచ్చిందని ప్రణీత తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











